వాతావరణ మార్పులతో అన్నదాత ఆందోళన
ABN , Publish Date - Apr 06 , 2025 | 12:53 AM
వరి పంట చేతికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో అన్నదాతలు ఆందోళన చెం దుతున్నారు.

రావులపాలెం, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): వరి పంట చేతికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో అన్నదాతలు ఆందోళన చెం దుతున్నారు. రావులపాలెం మండలం శనివారం మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావృతమై తేలికపాటి ఈదు రుగాలులు వీయడంతో రైతులు ఆవేదనకు గురయ్యారు. దాళ్వా సాగు చేసిన రైతులు అధిక పెట్టు బడులు పెట్టి పంటను సాగు చేశా రు. మండల పరిధిలోని గ్రామాల్లో ప్రస్తుతం రబీ సీజన్‌లో రైతులు 1121, 126, 111తో పాటు పలు వంగడాలను సాగు చేశారు. వీటిలో 126, 111తో పాటు ముం దుగా ఊడ్చిన వరి పొలాలు కోతకు సిద్ధమయ్యాయి. ఈ తరుణంలో వాతావరణంలో మార్పులు రావడంతో చేతికి అందివచ్చిన పంట ఏమి అవుతుందోనని రైతులు కలవరపడుతున్నారు.