Share News

పీజీఆర్‌ఎస్‌ అర్జీలు 92 శాతం పరిష్కారం

ABN , Publish Date - Apr 09 , 2025 | 12:49 AM

రెవెన్యూ పరంగా పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీల్లో 92 శాతం పరి ష్కరించారని కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలి పారు

పీజీఆర్‌ఎస్‌ అర్జీలు 92 శాతం పరిష్కారం

టెలీ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ ప్రశాంతి

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 8( ఆంధ్రజ్యోతి): రెవెన్యూ పరంగా పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీల్లో 92 శాతం పరి ష్కరించారని కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలి పారు.అమరావతి నుంచి సీసీఎల్‌ఏ కమిషనర్‌ జి.జయలక్ష్మి మంగళవారం జిల్లా కలెక్టర్లతో పీజీఆర్‌ఎస్‌ అర్జీలు, వాటర్‌ టాక్స్‌, భూముల క్రమబద్ధీకరణ అంశా లపై నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు.జిల్లా వ్యాప్తంగా పీజీ ఆర్‌ఎస్‌లో 6765 అర్జీలకు 6226 పరిష్కరించినట్టు తెలిపారు. ఇంకా 529 అర్జీలు పరిష్కరించాల్సి ఉందన్నారు. భూముల క్రమబద్ధీకరణకు ఇప్పటి వరకు 278 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీఆర్‌వో 251, ఆర్‌ఐ 27 పరిశీలించారని తెలి పారు. 150 గజాల్లోపు 271 దరఖాస్తులు 151-300 గజాల్లోపు 6 దరఖాస్తులు 450 గజాలు పైబడి ఒక్క దరఖాస్తు వచ్చినట్టు తెలిపారు. నీటి తీరువా పన్నుల వసూళ్లకు సంబంధించి 272 రెవెన్యూ గ్రామ పంచాయతీలకు ఇప్పటి వరకు 254 పంచాయతీల పరిధిలో వసూళ్లు పూర్తి చేసినట్టు తెలిపారు.సమావేశంలో జేసీ ఎస్‌.చిన్నరాముడు, డీఆర్‌వో టి. సీతారామమూర్తి,జిల్లా ల్యాండ్‌ సర్వే అ ధికారి బి.లక్ష్మినారాయణ, డిప్యూటీ తహశీల్దార్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 12:49 AM