Share News

కూతురి బాధ..అప్పుల వ్యథ!

ABN , Publish Date - Mar 15 , 2025 | 12:45 AM

రాజమహేంద్రవరం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక ఇబ్బందులు తాళలేక కాకినాడకు చెందిన దంపతులు గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం టూటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకి నాడ జిల్లా తూరంగికి చెందిన కాళ్ల వెంకట రమణ(55) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య వరలక్ష్మి(50) చీటీలు వేస్తారు. చాలా కాలంగా నమ్మకంగా ఉంటున్నారు. దీంతో స్థానికులు కూడా ఎంతో నమ్మారు

కూతురి బాధ..అప్పుల వ్యథ!

తట్టుకోలేక గోదారిలో దూకేసిన దంపతులు

మృతదేహాల గుర్తింపు

రాజమహేంద్రవరం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక ఇబ్బందులు తాళలేక కాకినాడకు చెందిన దంపతులు గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం టూటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకి నాడ జిల్లా తూరంగికి చెందిన కాళ్ల వెంకట రమణ(55) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య వరలక్ష్మి(50) చీటీలు వేస్తారు. చాలా కాలంగా నమ్మకంగా ఉంటున్నారు. దీంతో స్థానికులు కూడా ఎంతో నమ్మారు. ఈ క్రమం లో దాదాపు రూ.60 లక్షల వరకూ అప్పులు చేశారు. తమ సొంతింటిని విక్ర యించి రూ.45లక్షల వరకూ అప్పులు తీర్చారు. ఇదిలా ఉండగా ఆరు నెలల కిందట ఒక్కగానొక్క కూతురు ప్రేమ వివాహం చేసుకుని ఇంటి నుంచి వెళ్లి పోయింది. ఒక వైపు కూతురి బాధ..మరో వైపు అప్పుల వాళ్లు పీడించడంతో మానసికంగా నలిగిపోయారు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో రాజమహేంద్రవరం పిండాల రేవుకు వచ్చి కూతురిని తలచుకుని బాగా రోధించారు. తర్వాత ఇద్దరూ గోదా వరిలోకి దూకి ప్రాణాలు విడిచారు. తాము ఆర్థిక ఇబ్బందులతో చచ్చి పోతున్నామంటూ గోదా వరి గట్టుపై ఓ లెటర్‌ను ఉంచారు. తమ ఆధార్‌ కార్డులను కూడా అక్కడే పెట్టారు. స్థానికుల సమాచారం తో టూటౌన్‌ సీఐ మంగాదేవి ఆదేశాల మేరకు సిబ్బంది చేరుకుని గాలింపు చేపట్టారు. కొద్ది సమయంలో మృతదేహాలను గుర్తించారు. ఆధార్‌ కార్డుల ఆధారంతో వారి చిరునామా తెలుసుకుని బంధువులకు ఫోన్‌లో సమాచా రం ఇచ్చారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో శవ పరీక్షల అనంతరం మృతదేహాలను సంబం ధీకులకు అప్పగించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ మంగాదేవి పేర్కొన్నారు.

Updated Date - Mar 15 , 2025 | 12:45 AM