Share News

Indian Student Self Deported: భారతీయ విద్యార్థి స్వీయ బహిష్కరణ.. వీడియో షేర్ చేసిన అమెరికా అధికారి

ABN , Publish Date - Mar 15 , 2025 | 11:22 AM

హమాస్‌కు మద్దతు పలికిన ఆరోపణలతో వీసా రద్దు కావడంతో అమెరికాలో భారతీయ విద్యార్థిని రంజనీ శ్రీనివాసన్ తనంతట తానుగా భారత్‌కు తిరిగొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Indian Student Self Deported: భారతీయ విద్యార్థి స్వీయ బహిష్కరణ.. వీడియో షేర్ చేసిన అమెరికా అధికారి
Indian Student Self Deported from US

ఇంటర్నెట్ డెస్క్: పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌కు మద్దతు ఇచ్చినందుకు వీసా రద్దు కావడంతో ఓ భారతీయ విద్యార్థిని తనంతట తానుగా ఆమెరికాను వీడారు( స్వీయ బహిష్కరణ). కొలంబియాలో యూనివర్సిటీలో చదువుకుంటున్న రంజనీ శ్రీనివాసన్.. సీబీపీ హోమ్ యాప్ సాయంతో మార్చి 11న దేశాన్ని వీడారు. భద్రతా కారణాల రీత్యా అమెరికా విదేశాంగ శాఖ ఆమె వీసాను మార్చి 5న రద్దు చేసింది. ఈ విషయాన్ని హోమ్‌లాండ్ సెక్యూరిటీ సెక్రెటరీ క్రిస్టీ నోయెమ్ ధ్రువీకరించారు. రంజనీ ఎయిర్‌పోర్టులో ఉన్నప్పుడు తీసిన వీడియోను నెట్టింట పంచుకున్నారు (Indian Student Self deports from US).

‘‘అమెరికా వీసా లభించడం ఓ అద్భుత అవకాశం. కానీ హింసకు, ఉగ్రవాదానికి మద్దతు పలికితే ఆ హక్కు కోల్పోవాల్సి ఉంటుంది. ఇలాంటి వాళ్లకు అమెరికాలో స్థానం లేదు. ఉగ్రవాద సానుభూతి పరురాలిగా ఉన్న కొలంబియా యూనివర్సిటీ విద్యార్థి సీబీపీ యాప్ ద్వారా తనంతట తానుగా దేశాన్ని వీడటం హర్షనీయం’’ అని ఆమె ఎక్స్ వేదికగా కామెంట్ చేశారు.


JD Vance Green Card: వాళ్లనీ బహిష్కరించొచ్చు.. గ్రీన్ కార్డుపై అమెరికా ఉపాధక్షుడి కీలక వ్యాఖ్యలు

అమెరికా కాలేజీల్లో పాలస్తీనా అనుకూల నిరసనలు పెలుబికిన నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం విదేశీ విద్యార్థులపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో శ్రీనివాసన్ ఉదంతం సంచలనంగా మారింది. మరో కొలంబియా స్టూడెంట్ లీకా కార్డియాను హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ అధికారులు అరెస్టు చేశారు. విద్యార్థి వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఉంటున్నందుకు అదుపులోకి తీసుకున్నారు. అంతకుమునుపు కొలంబియా యూనివర్సిటీలో జరిగిన హమాస్ అనుకూల నిరసనల్లో పాల్గొన్నందుకు కూడా లీకా కార్డియాను పోలీసులు అరెస్టు చేశారు.


TANA: 24వ తానా మహాసభల సర్వ కమిటీ సమావేశం

ఎవరీ రంజనీ శ్రీనివాస్

కొలంబియా యూనివర్సిటీలో రంజనీ శ్రీనివాస్ అర్బన్ ప్లానింగ్‌లో పీహెచ్‌డీ చేస్తున్నారు. ఆమెకు ఫుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్ ఉంది. కొలంబియా యూనివర్సిటీకి చెందిన గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌, ప్లానింగ్, ప్రిసర్వేషన్‌లో ఎమ్‌ఫిల్ చేశారు. ఢిల్లీలోని సీఈపీటీ యూనివర్సిటీలో బ్యాచిలర్ డిజైన్ కోర్సు చేశారు.

మరిన్ని ఎన్నారై వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Mar 15 , 2025 | 11:22 AM