Share News

Hyderabad: ఉండేది గేటెడ్‌ కమ్యూనిటీలో.. అమ్మేది గంజాయి..

ABN , Publish Date - Mar 15 , 2025 | 11:04 AM

గెటెడ్ కమ్యూనిటీలో ఉంటూ గంజాయిని విక్రయిస్తున్న ఓ ప్రబుద్దుడి విషయం ఒకటి హైదరాబాద్ నగరంలో వెలుగుచూసింది. ప్రస్తుతం పోలీసులు అతడిని అదుపులోకా తీసుకుని గంజాయి వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు.

Hyderabad: ఉండేది గేటెడ్‌ కమ్యూనిటీలో.. అమ్మేది గంజాయి..

- ముంబయి నుంచి నగరానికి కుష్‌ గంజాయి తీసుకొచ్చి అమ్మకాలు

- ఇద్దరు అమ్మకం దారులు.. నలుగురు కొనుగోలుదారుల అరెస్ట్‌

హైదర్‌నగర్‌: ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్ధేశ్యంతో ముంబయి(Mumbai) నుంచి నగరానికి వచ్చాడు అశిష్‏కుమార్‌. గంజాయి అమ్ముతూ నగరంలో ఒకసారి పట్టుబడి బెయిల్‌ పై విడుదలయ్యాడు. కుటుంబంతో కలిసిఉంటే మారుతాడని భావించిన తల్లిదండ్రులు ముంబయి నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చి అతనితో కలిసి ఉంటున్నా అతని ప్రవర్తన మారలేదు. తీరు మార్చుకోకుండా తిరిగి అదే బాటపట్టి గంజాయి సేవించడంతో పాటు అమ్మకాన్నే వృత్తిగా ఎంచుకున్నాడు. కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో పేరొందిన గేటెడ్‌ కమ్యూనిటీలో నివాసం ఉంటూ గంజాయి కావాల్సిన వాళ్లను అక్కడికే పిలుచుకుని అమ్మకాలు సాగిస్తున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: R. Krishnaiah: ఆర్‌. కృష్ణయ్య వార్నింగ్.. ఆ భూములు విక్రయిస్తే అడ్డుకుంటాం


ముంబయిలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై మౌనికారెడ్డి సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. తెలుసుకున్న అశిష్‏కుమార్‌(29), కట్టెంపూడి సాత్విక్‌(20)లు పారిపోయేందుకు ప్రయత్నించగా వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఒక జ్యూట్‌ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో భద్రపరిచిన కుష్‌ గంజాయిని డబ్బాలో గంజాయి అమ్మకం ద్వారా వచ్చిన రూ.7500 నగదు స్వాధీనం చేసుకున్నారు.అశిష్‏కుమార్‌ను పోలీసులను విచారించగా అతడికి గంజాయి సేవించే అలవాటు ఉందని, దాని కోసం ముంబయ్‌లో అమ్మేవారితో సంబంధాలు ఉండటంతో గంజాయి విక్రయాలు చేస్తూ, నగరంలో ఒకసారి పట్టుబడి బెయిల్‌పై బయటకు వచ్చాడు.


అశిష్‌ భవిష్యత్‌ కోసం కుటుంబం హైదరాబాద్‌ వచ్చి కేపీహెచ్‌బీ(KPHB)లో ఉంటున్నారు. ఈనెల 10న తన స్నేహితుడు సాత్విక్‌ను ముంబయ్‌కు పంపి 260 గ్రాముల కుష్‌ గంజాయి, 1100 గ్రాముల గంజాయి తెప్పించాడు. దాన్ని చిన్నచిన్న ప్యాకెట్లుగా మార్చి గురువారం తెలిసిన కొంతమంది యువకులుకు అమ్మేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అశిష్‌, సాత్విక్‌ను అదుపులోకి తీసుకున్న సమయంలో గంజాయి కొనేందుకు పెరాల రాహుల్‌, పెరల ప్రత్యూష్‌, అబ్రార్‌ఖాన్‌, జైబుడ్డేలే అక్కడకు రాగా పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. వారి వద్ద నుండి 260గ్రాముల కుష్‌ గంజాయి. 1100గ్రాముల గంజాయి, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


- డ్రగ్స్‌పై ఉక్కుపాదం: ఏసీపీ

గంజాయి డ్రగ్స్‌ వంటి మత్తు పదార్థాలు అమ్మేవారు చట్టం నుంచి తప్పించుకోలేరని, వీటిని వినియోగించేవారిపై నిత్యం నిఘా ఉంటుందని, కూకట్‌పల్లి ఏసీపీ శ్రీనివాసరావు హెచ్చరించారు. ఇప్పుడు దొరికిన కుష్‌ గంజాయి అమెరికా నుండి దిగుమతి చేసుకుని మరీ అమ్మకాలు చేస్తున్నారన్నారు. దీని విలువ మామూలు గంజాయి కంటే చాలా ఎక్కుగా ఉంటుందని, కుష్‌ గంజాయి గ్రాము రూ.3000పైనే ఉంటుందని, పట్టుబడిన గంజాయి విలువ రూ.10లక్షలు ఉండవచ్చునని ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Arjun Reddy: గ్రూప్‌-3 టాపర్లూ పురుషులే..

నాగారంలోని ఆ 50 ఎకరాలు భూదాన్‌ భూములు కావు

కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై.. తుది దశకు సాధ్యాసాధ్యాల అధ్యయనం

మా సిఫారసు లేఖలు తీసుకోవాలి

Read Latest Telangana News and National News

Updated Date - Mar 15 , 2025 | 11:04 AM