వర్గీకరణ పేరుతో మాలలను అణచివేసే కుట్ర’
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:48 AM
వర్గీకరణ పేరుతో మాలలను అణచివేసే విధంగా ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్ప కొడదామని కోనసీమ జిల్లా మాలల ఐక్యవేదిక సమావేశం పిలుపునిచ్చింది.

అమలాపురం రూరల్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): వర్గీకరణ పేరుతో మాలలను అణచివేసే విధంగా ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్ప కొడదామని కోనసీమ జిల్లా మాలల ఐక్యవేదిక సమావేశం పిలుపునిచ్చింది. ఆదివారం బండారులంకలో ఐక్యవేదిక కన్వీనర్ జంగా బాబూరావు ఆధ్వర్యంలో మాల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఐక్యవేదిక అధ్యక్షుడు డీబీ లోక్ మాట్లాడుతూ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలమహానాడు వ్యవస్థాపకుడు పీవీరావు జీవితాంతం పోరాటం సాగించారని గుర్తుచేశారు. వర్గీకరణపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టి ఇష్టానుసారం వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఇవ్వడం దారుణమన్నారు. 2011జనాభా లెక్కల ఆధారంగా వన్‌మెన్ కమిషన్ అంకెల గారడీతో వర్గీకరణకు ఆమోదం తెలపడం అన్యాయమన్నారు. ఈనెల14న అంబేడ్కర్ జయంత్యుత్సవాలను నిర్వహించేందుకు సమావేశం నిర్ణయించింది. అడ్డగోలుగా జరిగిన ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వానికి అదేవేదికగా అల్టిమేటం జారీ చేస్తామని ప్రధాన కార్యదర్శి ఇసుకపట్ల రఘుబాబు పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు గెడ్డం సురేష్‌బాబు, రేవు తిరుపతిరావు, గొల్లపల్లి డేవిడ్, బత్తుల మురళీ, బొంతు మణిరాజ్, కోట రామ్మోహన్, రవ్వా భూషణం, బడుగు జేమ్స్‌పాల్, బొంతు బాలరాజు, నక్కా సపంత్‌కుమార్, కప్పల శ్రీధర్, కాకర శ్రీను, గూటం సాయి, పినిపే జయరాజ్, నెల్లి లక్ష్మీపతి, ఊటాల వెంకటేష్, మెండు రమేష్ పాల్గొన్నారు.