Share News

ఆగని ఇసుక దందా!

ABN , Publish Date - Apr 14 , 2025 | 01:09 AM

ఉచిత ఇసుక విధానం ఇపుడిప్పుడే సరైన దారిలో పడుతోంది. గతంలో పోల్చుకుంటే చాలావరకూ ధర కూడా అందుబాటులో ఉంది. ర్యాంపు నిర్వాహకులు, రాజకీయ నేతల స్వలాభం తగ్గితే మరింత ధర తగ్గే అవకాశం ఉంది. అయితే అఖండ గోదావరిలో రాజమ హేంద్రవరం వైపు, కొవ్వూరువైపు రా

ఆగని ఇసుక దందా!
Sand Dredging (ఫైల్‌ఫొటో)

జోరుగా డ్రెడ్జింగ్‌

కొంతవరకూ తగ్గిన ధర

సెమీ మెకనైజ్డ్‌ రీచ్‌లతో

మరింత అందుబాటులోకి?

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

ఉచిత ఇసుక విధానం ఇపుడిప్పుడే సరైన దారిలో పడుతోంది. గతంలో పోల్చుకుంటే చాలావరకూ ధర కూడా అందుబాటులో ఉంది. ర్యాంపు నిర్వాహకులు, రాజకీయ నేతల స్వలాభం తగ్గితే మరింత ధర తగ్గే అవకాశం ఉంది. అయితే అఖండ గోదావరిలో రాజమ హేంద్రవరం వైపు, కొవ్వూరువైపు రాత్రి వేళ డ్రెడ్జింగ్‌ కూడా చేస్తున్నారు. డ్రెడ్జింగ్‌తో రాత్రి ఇవాళ గోదావరి ర్యాంపులలో గుట్టలు పెట్టి, పగటిపూట ఇష్టానుసారం అమ్ముకుంటున్నా రు. బోట్స్‌మన్‌ సొసైటీల ముసుగులో ఈ దం తా సాగుతోంది. ర్యాంపుల నిర్వాహకులైన రాజకీయ నేతలకు టన్నుకు రూ.50 వంతున 20 టన్నుల ఇసుక లారీకి రూ.1000 ఇవ్వవ లసి వస్తోంది. కొందరైతే లారీకి 100 నుంచి రూ.180 వరకూ డిమాండ్‌ చేస్తున్నట్టు ప్రచా రం జరుగుతోంది. టన్ను వంతున తమ వాటా తమకు ఇచ్చేసి, ఓవర్‌లోడుతో వ్యాపా రం చేసుకోమని కూడా కొందరు సలహా ఇస్తు న్నట్టు సమాచారం. నిర్వాహకులు కూడా పడవుల మీద కాకుండా మెకనైజ్డ్‌ బోట్లతో డ్రెడ్జింగ్‌ చేయడం వల్ల నేతలకు ముడుపులు ఇచ్చేసినా బాగానే దోచుకోవడం గమనార్హం. ఈనేపధ్యంలో బోట్స్‌మన్‌ సొసైటీలన్నీ కుమ్మ క్కయిపోయి.. డ్రెడ్జింగ్‌ చేసే వారితో చేతులు కలిపి, తలో కొంత పంచుకోవడం గమనార్హం.

మెకనైజ్డ్‌ రీచ్‌లతో ధర తగ్గేనా?

ఇటీవల ఇసుక బాగా అందుబాటులోకి వచ్చింది. అంతేకాక గత వైసీపీ ప్రభుత్వం నాటితో పోల్చుకుంటే బాగా ధర తగ్గినట్టే చెప్పవచ్చు. 25 టన్నుల ఇసుక గతంలో సుమారు రూ.21 వేలకు వినియోగదారుడికి అందితే, ఇవాళ సుమారు రూ.13 వేలకే వచ్చే స్తోంది. జిల్లా యంత్రాంగం ఇటీవల 10 సెమీ మెకనైజ్డ్‌ రీచ్‌లకు అనుమతి ఇచ్చింది. జిల్లాలోనే అంటే ర్యాంపులలో విక్రయించ డానికి ఐదు సెమీమెకనైజ్డ్‌ బోట్లకు టెండర్లు పిలవగా అందులో నాల్గింటిని ఎంపిక చేసిం ది. ప్రక్కిలంకలో 7,05,000 టన్నుల ఇసుక సామర్థ్యంతో ఎనర్జియో ప్రొజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఫైనల్‌ చేసింది. చిడిపి ర్యాంపులో 7,24, 500 టన్నుల సామర్థ్యంతో గాలి సుబ్బ రాజు కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి ఇచ్చింది. అరికి రేవుల ర్యాంపును 8,71,500 టన్నుల సామ ర్థ్యంతో ఇసుక తీసుకునే విధంగా కేవీవీఎస్‌ఎన్‌ ఇన్‌ఫ్రా (ఇండియా) లిమిటెడ్‌కు ఇచ్చింది. పురుషోత్తపల్లి ర్యాంపులో 1,05,000 టన్నుల సామర్థ్యంతో శ్రీసాయి బాలాజీ కన్‌స్ట్రక్షన్స్‌కు ఇచ్చింది. ఈ నాలుగు ర్యాంపుల ద్వారా మొ త్తం 24 లక్షల, 6 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక తీయనున్నారు. సుమారుగా వారం రోజుల్లో ఈ ర్యాంపులు ప్రారంభం అవుతాయి. ఇక్కడ మెకనైజ్డ్‌ బోట్లతో ఇసుక తీస్తారు అంటే డ్రెడ్జింగ్‌కు అనుమతి ఇచ్చినట్టు. దీంతో ఎక్కువ ఇసుక వస్తుంది. ఈ సంస్థలన్నీ టన్ను ఇసుకను రూ.35కే తీస్తామని టెం డర్లు వేయడం గమనార్హం. దీనితో ఇసుక ధర మరికొంత తగ్గడంతోపాటు ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉచిత ఇసుక విధానం రానున్న రోజుల్లో మరిన్ని మంచి ఫలి తాలను కూడా ఇవ్వవచ్చు. పెండ్యాల ర్యాంపు నుంచి పశ్చిమగోదావరికి జిల్లాకు 4 లక్షల 62వేల టన్నుల ఇసుక, కుమార దేవం ర్యాంపు నుంచి విశాఖపట్నానికి 8 లక్షల 85వేల టన్నుల ఇసుక, తాడిపూడి నుంచి ఏలూరు జిల్లాకు 7,39,950 టన్నుల ఇసుక, సింగవరం నుంచి అనకాపల్లికి 5 లక్షల 16 వేల టన్నుల ఇసుక, కాటవరం ర్యాంపు నుంచి కాకినాడకు 3,46,500 మె ట్రిక్‌ టన్నుల ఇసుక సెమీమెకనైజ్డ్‌ విధా నంలో తీసేటట్టు నిర్ణయం తీసుకున్నారు.

Updated Date - Apr 15 , 2025 | 07:58 AM