కాలువలోకి స్కూలు వ్యాన్ బోల్తా
ABN , Publish Date - Apr 08 , 2025 | 12:39 AM
గొల్లప్రోలు రూరల్, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): గొల్లప్రోలు మండలం చెందుర్తి శివారులో కాలువలోకి స్కూలు వ్యాన్ బోల్తా పడి ఏడుగురు వి ద్యార్థులు, డ్రైవర్ గాయపడ్డారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు పట్టణ శివారులోని ఒక ప్రైవేటు విద్యాసంస్థకు చెందిన స్కూలు మినీ వ్యాన్ చెందుర్తిలో పది మంది విద్యార్థులను ఎక్కించుకుని

ఏడుగురు విద్యార్థులు, డ్రైవర్‌కు గాయాలు
గొల్లప్రోలు రూరల్, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): గొల్లప్రోలు మండలం చెందుర్తి శివారులో కాలువలోకి స్కూలు వ్యాన్ బోల్తా పడి ఏడుగురు వి ద్యార్థులు, డ్రైవర్ గాయపడ్డారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు పట్టణ శివారులోని ఒక ప్రైవేటు విద్యాసంస్థకు చెందిన స్కూలు మినీ వ్యాన్ చెందుర్తిలో పది మంది విద్యార్థులను ఎక్కించుకుని బయల్దేరింది. చెందుర్తి శివారులోకి వచ్చేసరిగా ఎదురుగా వస్తున్న లారీ మీదకు రావడంతో మినీవేన్‌ను డ్రైవర్ తప్పించబోయాడు. అదుపు తప్పడంతో కాలువలోకి దూసుకుపోయి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో జి.హర్షిత, అపర్ణ, సిద్ధు, ధరణి, కె.భార్గవ్, హాసిని, నిహారికలకు గాయాలయ్యాయి. డ్రైవర్‌కు కాళ్లు విరిగాయి. పాఠశాల యజమాన్య ప్రతినిధులు వారిని చికిత్స నిమిత్తం పిఠాపురంలోని ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. ఒక విద్యార్థిని మాత్రం కాలువలో నీరు ఎక్కువగా తాగడంతో అస్వస్థతకు గురైంది. క్షతగాత్రులను పిఠాపురం సీఐ శ్రీనివాస్ పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరు గురించి తెలుసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి చేరుకుని తమ వారికి ఏమైందోనని ఆందోళనకు గురయ్యారు.