Share News

హిందువులు చైతన్యవంతంగా ఉండాలి

ABN , Publish Date - Apr 07 , 2025 | 12:20 AM

హిందువులందరూ,నిత్య చైతన్యవంతంగా ఉండాలని కడప జిల్లా బ్రహ్మంగారి మఠానికి చెందిన స్వామి విరజానంద, అఖిల భారత ధర్మజాగరణ ప్రముఖ్‌ ఆలే కుమార్‌ పిలుపునిచ్చారు.

హిందువులు చైతన్యవంతంగా ఉండాలి
శోభాయాత్రలో ప్రసంగిస్తున్న స్వామి విరజానంద

ఘనంగా శ్రీరామ శోభాయాత్ర

రాజమహేంద్రవరం కల్చరల్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి) : హిందువులందరూ,నిత్య చైతన్యవంతంగా ఉండాలని కడప జిల్లా బ్రహ్మంగారి మఠానికి చెందిన స్వామి విరజానంద, అఖిల భారత ధర్మజాగరణ ప్రముఖ్‌ ఆలే కుమార్‌ పిలుపునిచ్చారు.శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం పుష్కర్‌ ఘాట్‌ నుంచి శోభాయాత్ర కోలాహలంగా సాగింది. హిందూ సమాజం నిద్రాణం నుంచి మేల్కోవాలన్నారు. మనం అంతా సంఘటితంగా లేకపోతే ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయో కొన్ని సంఘటనలు ఉదహరిస్తూ వివరించారు.శ్యా మ్‌కుమార్‌ మాట్లాడుతూ వెయ్యేళ్ళుగా నిద్రా ణంలో ఉన్న మన హిందూ జాతి ఇప్పుడిప్పు డే మేల్కొంటుందన్నారు. గడచిన వందేళ్లుగా హిందూ జాగరణకు చేస్తున్న ప్రయత్నం ఇప్పు డు మంచి ఫలితాలనిస్తుందన్నారు. శ్రీరామ శోభా యాత్ర.. జై శ్రీరామ్‌ నినాదాలతో మార్మో గింది. బైక్‌లపై యువత, పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. శ్రీరామ సేవా సమితి అధ్యక్షుడు పతివాడ రామరాజు మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా శోభాయాత్ర జరుపుతున్నా మ న్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్య క్షురాలు,ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మె ల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్‌, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, మాజీ ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాంత కార్యకారిణి ఓలేటి సత్యనారాయణ, రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు, జనసేన సిటి ఇన్‌చార్జ్‌ అనుశ్రీ సత్యనారాయణ, రాజమండ్రి బిజెపి కన్వీనర్‌ యెనుముల రంగబాబు,హీరాచంద్‌ జైన్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2025 | 12:20 AM