Share News

ఇష్టపడిన మహిళ తనతో ఉండనందని ఆత్మహత్య?

ABN , Publish Date - Apr 07 , 2025 | 12:19 AM

ష్టపడిన మహిళ తనతో పాటు ఉండనం దని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇష్టపడిన మహిళ తనతో ఉండనందని ఆత్మహత్య?
మృతిచెందిన సునీల్‌

సీతానగరం, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి) : ఇష్టపడిన మహిళ తనతో పాటు ఉండనం దని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామచంద్రపురం గ్రామానికి చెందిన వేమగిరి సునీల్‌ (26)కు గతంలో వివాహమైంది. మన స్పర్థలు రావడంతో భార్య సునీల్‌పై కేసు పెట్టింది. ఇదిలా ఉండగా వరుసకు మరదలైన ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. శ్రీరామ నవమి నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌ నుంచి సీతానగరం చేరు కుని సునీల్‌ను కలి సింది. అనంతరం ఇరువురు కలిసి శ్రీరామనగర్‌లోని రాజుగారి గార్డెన్స్‌లో ఫంక్షన్‌ హాల్‌కు వెళ్లి ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు గడిపారు. తనతో పాటు ఉన్న మహిళను పర్మినెంట్‌గా ఉండిపోవాలని సునీల్‌ కోరాడు. ప్రస్తుతం కేసు నడుస్తోంది కదా అలా చేయడం తప్పని చెప్పి బాత్‌రూంకు వెళ్లి వచ్చే లోపు సునీల్‌ ఉరివేసుకున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న సునీల్‌ను పీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు సిబ్బంది తెలిపారు. మృతుడి బంధువు లు రాగానే మహిళ వెళ్లిపోయినట్టు కుటుం బీకులు తెలిపారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ రామ్‌కుమార్‌ తెలిపారు. మృతుడికి తండ్రి అబ్బులు, తల్లి శాంతి, సోదరి స్వప్న ఉన్నారు.

Updated Date - Apr 07 , 2025 | 12:19 AM