Share News

రావులపాలెంలో ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం

ABN , Publish Date - Apr 03 , 2025 | 01:17 AM

రావులపాలెంలో ట్రాఫిక్‌ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.

రావులపాలెంలో ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం

రావులపాలెం, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): రావులపాలెంలో ట్రాఫిక్‌ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. బుధవారం రావులపాలెంలో హైవే, ఆర్‌అండ్‌బీ, పోలీస్‌ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి కోనసీమ ముఖద్వారం, రింగ్‌రోడ్డు, కళా వెంకట్రావు సెంటర్‌ ప్రాంతాలను ఆయన పరిశీలించారు. అనంతరం రావులపాలెం మండల పరిషత్‌ మీటింగ్‌ హాలులో ట్రాఫిక్‌ నియంత్రణకు శాశ్వత పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కోనసీమ ముఖద్వారం కళా వెంకట్రావు సెంటర్‌ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా పరిష్కారాలను సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రతి శనివారం వాడపల్లి ఆలయానికి వెళ్లే భక్తులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ కేవీ సత్యనారాయణరెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ పలు అంశాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం డీఎస్పీ సుంకర మురళీమోహన్‌, పీడీ సురేంద్రనాధ్‌ పలు అంశాలపై మాట్లా డారు. కార్యక్రమంలో విక్టరీ వెంకటరెడ్డి, చిలువూరి సతీష్‌రాజు, గుత్తుల రాంబాబు, జక్కంపూడి వెంకటస్వామి, ఎంపీడీవో మహేష్‌, తహశీల్ధారు ముక్తేశ్వరరావు, ఆర్‌అండ్‌బీ డీఈఈ రాజేంద్ర, సీఐలు ఎం.శేఖర్‌బాబు, సీహెచ్‌ విద్యాసాగర్‌, సెక్రటరీ ఎల్‌.దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2025 | 01:18 AM