Share News

గోదావరిలో స్నానానికి దిగి ఇద్దరు యువకుల గల్లంతు

ABN , Publish Date - Apr 15 , 2025 | 01:05 AM

కొవ్వూరు/, ఏప్రిల్‌ 14 (ఆంధ్ర జ్యోతి): తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం మద్దూరు లంక గ్రామంలోని చిగురులంక వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగి ఇద్దరు యువకులు గల్లంత య్యారు. సోమవారం మధ్యా హ్నం సమయంలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ చదువుతున్న ముగ్గరు యువకులైన నిడద

గోదావరిలో స్నానానికి దిగి ఇద్దరు యువకుల గల్లంతు
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న మంత్రి దుర్గేష్‌

బయపడిన మరో యువకుడు

గాలింపు చర్యలు చేపట్టిన పోలీసు, ఫైర్‌, రెవెన్యూ అధికారులు

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి దుర్గేష్‌, ఆర్డీవో, డీఎస్పీ

కొవ్వూరు/, ఏప్రిల్‌ 14 (ఆంధ్ర జ్యోతి): తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం మద్దూరు లంక గ్రామంలోని చిగురులంక వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగి ఇద్దరు యువకులు గల్లంత య్యారు. సోమవారం మధ్యా హ్నం సమయంలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ చదువుతున్న ముగ్గరు యువకులైన నిడదవోలు చర్చిపేట నుంచి రత్నదీప్‌, మత్తి ప్రకాష్‌కుమార్‌ (15), రాజమహేంద్రవరానికి చెందిన గంధం హర్ష (18) మద్దూరులంక వద్ద బ్యారేజ్‌ దిగువన స్నానానికి దిగా రు. నదీ లోతుగా ఉండడంతో ప్ర మాదవశాత్తు మునిగిపోతుండగా అక్కడే ఉన్న నిడదవోలుకు చెందిన మరో ఆరుగురు యువకులు రక్షించే ప్రయత్నంచేశారు. వారిలో దివాకర్‌ అనే యువకుడు రత్నదీప్‌ను రక్షించాడు. మిగిలిన ఇద్దరు గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌, ఆర్డీవో డా.రాణి సుస్మిత, డీఎస్పీ జి.దేవకుమార్‌, తహశీల్దార్‌ ఎం.దుర్గాప్రసాద్‌, రూరల్‌ ఎస్‌ఐ కె.శ్రీహరిరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక జాలర్లు, ఫైర్‌ సిబ్బందితో గోదావరిలో అర్ధరాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టారు. మంత్రి దుర్గేష్‌ మాట్లాడుతూ ఎంతో భవిష్యత్‌ ఉన్న యువకులు ప్రమాదవశాత్తు నదిలో గల్లంతవ్వడం బాధాకరమన్నారు. తల్లితండ్రులను చూస్తుంటే గుండె తరుక్కుపోతుందన్నారు. గల్లంతైనవారిని వెలికితీయడానికి కాకినాడ నుంచి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను, గజ ఈతగాళ్లను రప్పిస్తున్నామన్నారు. సంఘటనా స్థలమంతా యువకుల తల్లితండ్రులు, బంధువుల రోదనలతో నిండిపోయింది.

ఉదయమంతా చలాకీగా తిరిగి.. మధ్యాహ్నానికి మాయమై...

నిడదవోలు, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): కొవ్వూరు మండలం మద్దూరులంక వద్ద గోదావరిలో గల్లంతైన ఇద్దరిలో ఒకరు మత్తి ప్రకాష్‌కుమార్‌ (15) నిడదవోలు చర్చిపేట కు చెందినవాడు కావడంతో అక్కడ విషా దచాయలు అలుముకున్నాయి. ఇటీవల ప దో తరగతి పబ్లిక్‌ పరీక్షలు రాశాడు. సోమవారం అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాల అనం తరం స్నేహితులతో కలిసి మద్దూరులంకలో గోదావరి స్నానానికి వెళ్లి గల్లంతయ్యాడు. తల్లి ఉపాధి నిమిత్తం కువైట్‌ వెళ్లగా, తండ్రి ప్రైవేటు ఆంబులెన్స్‌ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఉదయం నుంచి తమతో ఎంతో చలాకీగా తిరిగిన ప్రకాష్‌కుమార్‌ గోదావరిలో గల్లంతయ్యా డని తెలిసి స్థానికులు ఆవేదన చెందుతున్నారు.

Updated Date - Apr 15 , 2025 | 01:05 AM