Share News

వెంకన్న కల్యాణానికి వేళాయే...

ABN , Publish Date - Apr 07 , 2025 | 12:06 AM

ఆత్రేయపురం, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోనే ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దివ్యకల్యాణ మహోత్సవాలకు ఏర్పాట్లు చురుకుగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి 13 వరకూ నిర్వహించే కల్యాణోత్సవాలకు కోనసీమ జిల్లా కలెక్టర్‌ మహేష్‌కుమార్‌, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఎస్పీ కృష్ణారావు ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో రెండు దఫాలు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. వివిధ రాష్ర్టాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలిరానున్న దృష్ట్యా భక్తుల సౌకర్యాలపై సమీక్షించి ఆ దిశగా ఏర్పాట్లు చేపట్టాలని

వెంకన్న కల్యాణానికి వేళాయే...
వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి

నేటి నుంచి వాడపల్లిలో శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు

వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాదిగా తరలిరానున్న భక్తులు

రేపు తీర్థం, రథోత్సవం, కల్యాణం

ఆత్రేయపురం, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోనే ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దివ్యకల్యాణ మహోత్సవాలకు ఏర్పాట్లు చురుకుగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి 13 వరకూ నిర్వహించే కల్యాణోత్సవాలకు కోనసీమ జిల్లా కలెక్టర్‌ మహేష్‌కుమార్‌, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఎస్పీ కృష్ణారావు ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో రెండు దఫాలు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. వివిధ రాష్ర్టాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలిరానున్న దృష్ట్యా భక్తుల సౌకర్యాలపై సమీక్షించి ఆ దిశగా ఏర్పాట్లు చేపట్టాలని అధికార యంత్రాగాన్ని ఆదేశించారు. 7 దశమి సోమవారం స్వామివారి ధ్వజారోహణ, నిత్యబలిహరణ, 8న ఏకాదశి మంగళవారం స్వామివారి తీర్థం, రథోత్సవం, రాత్రి కల్యాణం, 9 ద్వాదశి బుధవారం స్వామివారి పొన్నవాహన మహోత్సవం, 10 త్రయోదశి గురువారం సద్యసం, చతుర్ధశి శుక్రవారం గౌతమి గోదావరి నదీలో తెప్పొత్సవం, 12 పౌర్ణమి శనివారం మహాపూర్ణాహుతి, చక్రస్నాన మహోత్సవం, 13 ఫాడ్యమి ఆదివారం స్వామివారి శ్రీపుష్పయాగముతో కల్యాణోత్సవాలు ముగియనున్నాయి. వైఖానస ఆగమ శాస్త్రప్రకారం ఖండవల్లి రాజేశ్వరప్రసాద్‌చార్యులు బ్రహ్మత్వంలో స్వామివారి కల్యాణోత్సవాలు నిర్వహించనున్నారు.

వార్షిక ఆదాయం రూ.30 కోట్లు

గతేడాది గ్రేడ్‌-1 స్థాయి కలిగిన ఈ ఆలయం డీసీ హోదాకు చేరుకుంది. స్వామివారి వార్షిక ఆదాయం రూ.30 కోట్లకు చేరుకుంది. అన్నదాన విరాళాలు రూ.10కోట్లు పైమాటే. దాతల సమకూరుస్తున్న విరాళాలతో పుణ్యక్షేత్రం విరాజిల్లుతుంది.

ఆలయాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి

కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లోనే పాలకులు ఆలయాభివృద్ధిపై దృష్టిపెట్టారు. రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతోంది. ప్రతి శనివారం 50 వేలకు పైనే భక్తులు తరలివస్తున్నారు. ఆలయ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించింది. ఆ దిశగా అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. రహదారులు పార్కింగ్‌ ప్రహారి, టాయిలెట్లు, సీసీ రోడ్లు, గోశాల నిర్మాణం, తాత్కాలిక అన్నదాన షెడ్‌కు టైల్స్‌, ప్లైఓవర్‌ తదితర నిర్మాణాలు వేగవంతంగా చేపడుతున్నారు.

స్వామివారి చరిత్ర...

స్వయంభూ ఎర్రచందనమనే కొయ్యవిగ్రహాంతో మూర్తిభవించిన పరందాముడు ఈయన. ఇటువంటి విగ్రహాం భారతదేశంలో మరెక్కడ లేదు. పూర్వం గౌతమి గోదావరి నదీలో ఓ చందనం పెట్టే లభ్యమైంది. ఋషి పుంగవులతో అలరాలుతున్న ఆ ప్రాంతంలో ఈ చందనం పెట్టే లభించడంతో గ్రామస్తులు ఆ విగ్రహాన్ని మేళతాళ మంగళవాయిద్యాలతో తీసుకొచ్చి ప్రతిష్ఠించిన్నట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. అలనాడు నాటి నౌకపురి పినపోతు గజేంద్రుడు సముద్రంలో తమ ఓడలు కొట్టుకుపోయాయి. ఓడలన్ని సురక్షితంగా వస్తే ఆలయం నిర్మిస్తామని స్వామివారిని వేడుకున్నారు. ఓడలన్ని క్షేమంగా ఒడ్డుకు చేరడంతో దేవాలయం నిర్మించినట్టు చరిత్ర చెబుతుంది. అనంతరం స్వామి విశిష్టతను తెలుసుకున్న నాటి సంస్థానదీసులు వత్సవాయి తిమ్మగజపతి మహారాజు స్వామిని దర్శించుకున్నారు. దూపదీప నైవేద్యాల నిమిత్తం 275 ఎకరాలు, స్వామివారి సేవకుల మాన్యాలకు 110 ఎకరాలు భూములు విరాళంగా అందించారు. 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలంగా భక్తులు తరలివస్తున్నారు.

రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు

ఆలయాభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌ రూపొ ందించాం. ఆలయ ఎదురుగా కోనేరు నిర్మాణం, 3 వేలమంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించేలా భవన నిర్మాణం, డార్మేటరి, వసతిగృహాల నిర్మాణాలకు చర్యలు చేపడుతున్నాం. ప్రస్తుతం రూ.10కోట్లతో వివి ధ అభివృద్ధి పనులు శరవేగంగా రూపొందిస్తున్నాం.

- బండారు సత్యానందరావు, ఎమ్మెల్యే, కొత్తపేట

ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి

జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కల్యాణోత్సవ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాం. చూడచక్కనికల్యాణ వేదిక, భక్తులకు ఎండ వేడి తగలకుండా మజ్జిగ చలివేంద్రాలు, పాలు, బిస్కెట్లు, అన్నసమారాధన చేపడతాం. వివిధ శాఖలకు చెందిన అధికారులు భాగస్వామ్యంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపడుతున్నాం.

- నల్లం సూర్యచక్రధరరావు, ఉపకమిషనరు, వాడపల్లి దేవస్థానం

Updated Date - Apr 07 , 2025 | 12:06 AM