Share News

America Vs China: అమెరికాతో వాణిజ్య యుద్ధానికి సిద్ధమా.. 125 శాతం సుంకం పెంచిన చైనా

ABN , Publish Date - Apr 11 , 2025 | 03:38 PM

America Vs China: అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్నారు. అన్ని దేశాల పట్ల ఒక విధంగా ఆయన వ్యవహరిస్తుంటే.. డ్రాగన్ చైనా పట్ల ఆయన మరింత కఠిన వైఖరి అవలంభిస్తున్నారు. అయితే చైనా సైతం ఇప్పటికే అమెరికాకు తగిన రీతిలో సమాధాన మిచ్చిన చైనా.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

America Vs China: అమెరికాతో వాణిజ్య యుద్ధానికి సిద్ధమా.. 125 శాతం సుంకం పెంచిన చైనా

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ఉత్పత్తులపై సుంకాల విధిస్తున్న అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్ వ్యవహార శైలిపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. ఆ క్రమంలో చైనా ఉత్పత్తులపై ఏకంగా 145 శాతం సుంకాలను విధించారీ డొనాల్డ్ ట్రంప్. ఈ నేపథ్యంలో అమెరికా ఉత్పత్తులపై సుంకాలను 125 శాతానికి పెంచినట్లు చైనా శుక్రవారం ప్రకటించింది. అమెరికా ఉత్పత్తులపై సుంకాలను 84 శాతం నుంచి 125 శాతానికి పెంచినట్లు చైనా స్పష్టం చేసింది. అంతేకాదు.. అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలను విధిస్తూ.. తీసుకుంటున్న ఈ తరహా ఏక పక్ష నిర్ణయాలను ఎదిరించేందుకు తమతో చేతులు కలపాలని యూరోపియన్ యూనియన్‌ను చైనా దేశాధ్యక్షుడు జి జిన్‌పింగ్ కోరారు.

అయితే తమ దేశం పెంచిన ఈ సుంకాలు శనివారం నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. మరోవైపు ఈ సుంకాలు పెంచడంతో ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య యద్ధనికి ఇప్పటికే తెర తీసినట్లయింది. తాజాగా చైనా సైతం అమెరికా ఉత్పత్తులపై సుంకాలను భారీగా పెంచడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లుగా పరిస్థితి మారింది. చైనాపై అమెరికా అసాధారణంగా సుంకాలను విధించడం ద్వారా అంతర్జాతీయ వాణిజ్య విధానాలతోపాటు ప్రాథమిక ఆర్థిక చట్టాలను అతిక్రమించిందని బీజింగ్‌లోని స్టేట్ కౌన్సిల్ టారిఫ్ కమిషన్ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.


ట్రంప్ సుంకాల వల్ల ఏర్పడిన ప్రపంచ ఆర్థిక రంగం అల్లకల్లోలంగా మారిందని.. అందుకు అమెరికనే పూర్తి బాధ్యత వహించానలి స్పష్టం చేసింది. అమెరికా సుంకాల కారణంగా.. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ మార్కెట్లతోపాటు వాణిజ్య వ్యవస్థలకు కోలుకోలేని దెబ్బ తగిలాయని బీజింగ్‌లోని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. ఈ సుంకాలపై చైనా ఒత్తిడి అనంతరం అధ్యక్షుడు ట్రంప్.. ఇతర దేశాలపై సుంకాలను స్తంభింపచేయాలని నిర్ణయించుకున్నారని గుర్తు చేసింది.


మరోవైపు.. చైనా పై సుంకాలను 84 శాతం నుంచి 125 శాతానికి అమెరికా పెంచింది. దీనిపై చైనా ఇప్పటికే తనదైన శైలిలో స్పందించింది. ఇంతగా సుంకాలు పెంచినా.. తాము భయపడమని కుండబద్దలు కొట్టింది. చైనా పోరాడతామని స్పష్టం చేసింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తాము ముందుకెళ్లి పోరాడతామని.. అంతేకానీ వెనక్కి మాత్రం తగ్గమని ఇప్పటికే అమెరికా సుంకాలపై చైనా స్పష్టమైన ప్రకటన చేసింది.

For International news And Telugu News

Updated Date - Apr 11 , 2025 | 03:50 PM