Share News

MLC Nominations : ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నాలుగు నామినేషన్లు

ABN , Publish Date - Feb 08 , 2025 | 05:51 AM

పీఆర్‌టీయూ, ఎస్టీయూల మద్దతుతో మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు నామినేషన్‌ సమర్పించారు.

MLC Nominations : ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నాలుగు నామినేషన్లు

విశాఖపట్నం, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి శుక్రవారం నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. పీఆర్‌టీయూ, ఎస్టీయూల మద్దతుతో మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు నామినేషన్‌ సమర్పించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నుంచి భారీ ఊరేగింపుతో కలెక్టరేట్‌కు చేరుకున్నారు. పీఆర్‌టీయూ, ఏపీటీఎఫ్‌ (1938) రాష్ట్ర అధ్యక్షులు బి.కృష్ణయ్య, జి.ఉదయరాజ్‌, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమంది పైడిరాజు, ఏపీ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, పీఆర్‌టీయూ ఉమ్మడి విశాఖ అధ్యక్షుడు గోపినాథ్‌లు ర్యాలీలో పాల్గొన్నారు. ఇంకా రాయల సత్యనారాయణ, నూకల సూర్యప్రకాష్‌, పోతల దుర్గారావు తమ మద్దతుదారులతో కలెక్టరేట్‌కు వచ్చి రిటర్నింగ్‌ అధికారి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌కు నామినేషన్‌ పత్రాలు అందజేశారు.

Updated Date - Feb 08 , 2025 | 05:51 AM