Share News

Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..

ABN , Publish Date - Mar 30 , 2025 | 08:14 AM

తెలుగు ప్రజలందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు మంత్రి లోకేశ్. తెలుగువారిలో కొత్త ఆనందాలు తెచ్చే పండుగల్లో ఉగాది ప్రత్యేకమైందని చెప్పారు.

Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..
Ugadi 2025 Wishes

అమరావతి: తెలుగు రాష్ట్రాలు(Telugu States) సహా ప్రపంచవ్యాప్తంగా ఉగాది సంబరాలు (Ugadi 2025 Celebrations) ప్రారంభమయ్యాయి. ఉదయాన్నే లేచి పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు పెద్దఎత్తున ఆలయాలకు (Temple Visit) వెళ్తున్నారు. తెలుగు నూతన సంవత్సరం వేళ ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ కోర్కెలు తీర్చమని మెుక్కుకుంటున్నారు. అలాగే రంగురంగుల ముగ్గులు వేసి ఇంటిని అందగా అలంకరిస్తున్నారు. మరోవైపు ఉగాది పచ్చడి చేసి షడ్రురుచులు రుచి చూసేందుకు సిద్ధం అవుతున్నారు.


ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Lokesh).. ఏపీ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు చెప్పారు సీఎం చంద్రబాబు. వచ్చేవన్నీ మంచి రోజులనే సానుకూల దృక్పథంతో కొత్త ఏడాదిని స్వాగతిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ రాబోయే కాలంలో గణనీయమైన ప్రగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చంద్రబాబు ఆకాంక్షించారు. విశ్వావసు నామ సంవత్సరం తెలుగు ప్రజలందిరిలో సంతోషాన్ని నింపాలని, సకల విజయాలనూ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.


తెలుగు ప్రజలందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు మంత్రి లోకేశ్. తెలుగువారిలో కొత్త ఆనందాలు తెచ్చే పండుగల్లో ఉగాది ప్రత్యేకమైందని చెప్పారు. ఈ పర్వదినాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ తెలుగు సంవత్సరం ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేర్చి ఏడాది పొడవునా సుఖసంతోషాలతో జీవించాలని దేవుడిని ప్రార్థించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మరొక్కసారి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అంటూ ఎక్స్ వేదికగా మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

TDP Nara Lokesh: సీనియర్లకు గౌరవం.. జూనియర్లకు ప్రమోషన్‌

CM Chandrababu Naidu: ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తాం

Updated Date - Mar 30 , 2025 | 08:22 AM