Weather Report: షాకింగ్ న్యూస్.. ఇప్పటి వరకు చలి.. ఇక నుంచి..
ABN, Publish Date - Jan 09 , 2025 | 12:10 PM
Weather Report: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వాతావరణంలో పలు మార్పులు చోటుచేసుకుంటాయని భారత వాతావరణ శాఖ సూచించింది. వాతావరణ మార్పులతో ఉష్ణోగ్రతల్లో కూడా హెచ్చుతగ్గులు ఉంటాయని తెలపిింది.
అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కొనసాగుతుండగా, మరో అల్పపీడనం ఉత్తర తమిళనాడుపై ప్రభావం చూపనుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం వాయువ్య దిశ వైపు కదులుతూ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వైపు ప్రభావం చూపనుందని తెలిపింది. ఈనెల 11, 12వ తేదీల్లో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని సూచించింది. దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లో చలి మరింత పెరగవచ్చని చెప్పింది. బంగాళాఖాతంలో అల్పపీడనంతో హిందూ మహాసముద్రం కూడా మరింత ప్రభావం చూపించే అవకాశాలున్నాయని చెప్పింది.
ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో శాటిలైట్ అంచనాల ప్రకారం రోజంతా పొడి వాతావరణం ఉండటంతో మేఘాలు తక్కువగానే కనిపిస్తాయని తెలిపింది. మధ్యాహ్నం సమయంలో ఎండ అంతగా ఉండకపోవచ్చని చెప్పింది. ఇలా వాతావరణంలో కలిగే మార్పులతో గంటకు 35 కిలోమీటర్ల వేగంతో చలిగాలి వీచే అవకాశాలున్నాయని తెలిపింది. ఏపీలో గంటకు 16 కిలోమీటర్లు.. తెలంగాణలో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో చలిగాలుల ప్రభావం ఉంటుందని చెప్పింది. దూరపు ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది.
వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతల్లో కూడా హెచ్చుతగ్గులు ఉంటాయని చెప్పింది. పగటివేళ తెలంగాణలో 20 డిగ్రీల సెల్సియస్ ఉంటే.. ఏపీలో 29 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపింది. రాత్రి వేళలో15 డిగ్రీల సెల్సియస్ తెలంగాణలో... 18 డిగ్రీల ఉష్ణోగ్రత ఏపీలో రికార్డు అవుతుందని చెప్పింది. అడవులు ఉండే సమీప ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. తెలంగాణలో 50శాతంతో పగటివేళలో తేమ ఉండగా.. ఏపీలో 60 శాతం తేమ నమోదవుతుందని తెలిపింది. తెలంగాణలో 90శాతం తేమ ఉంటే ఏపీలో 90 శాతం పైగా ఉంటుందని పేర్కొంది. ఇలా మార్పులు ఉండటం వల్ల మంచు ప్రభావం ఉండటం.. రాత్రి వేళలో చలి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది.
ఈ వార్తలు కూడా చదవండి
Tirupati Incident: తొక్కిసలాటకు కారణం ఇదే.. భక్తుల ఆవేదన
Minister Anagani: తిరుపతికి బయల్దేరిన మంత్రి అనగాని సత్యప్రసాద్
YS Jagan: తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
Read Latest AP News and Telugu News
Updated Date - Jan 09 , 2025 | 01:11 PM