ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Narayana: భ‌వ‌న నిర్మాణాలు, లేఅవుట్లపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

ABN, Publish Date - Jan 10 , 2025 | 07:53 AM

Minister Narayana: భ‌వ‌న నిర్మాణాలు, లేఅవుట్ల అనుమ‌తుల‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మరకు మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి కానుక‌గా బిల్డర్లు, డెవ‌ల‌ప‌ర్లు, ప్రజ‌ల‌కు అనుకూలంగా ఉండేలా నిబంధ‌న‌ల్లో మార్పులు చేస్తూ జీవోలు జారీ చేశామని అన్నారు. లే అవుట్లలో రోడ్లకు గ‌తంలో ఉన్న12 మీటర్లకు బ‌దులు 9 మీట‌ర్లకు కుదిస్తూ స‌వ‌ర‌ణ‌ చేశామని చెప్పారు.

Minister Narayana

అమ‌రావ‌తి: భ‌వ‌న నిర్మాణాలు, లేఅవుట్ల అనుమ‌తుల‌కు సంబంధించి నిబంధనలను సుల‌భ‌త‌రం చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ బిల్డింగ్ రూల్స్ -2017, ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్ - 2017లో సవరణలు చేస్తూ వేర్వేరుగా ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా భవన, లే అవుట్ల అనుమతుల్లో మార్పులు తీసుకువచ్చామని అన్నారు. ఏపీలో రియ‌ల్ ఎస్టేట్ రంగం పెరిగేలా కీల‌క సంస్కర‌ణ‌లతో ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి నారాయణ తెలిపారు.


సంక్రాంతి కానుక‌గా బిల్డర్లు, డెవ‌ల‌ప‌ర్లు, ప్రజ‌ల‌కు అనుకూలంగా ఉండేలా నిబంధ‌న‌ల్లో మార్పులు చేస్తూ జీవోలు జారీ చేశామని అన్నారు. లే అవుట్లలో రోడ్లకు గ‌తంలో ఉన్న12 మీటర్లకు బ‌దులు 9 మీట‌ర్లకు కుదిస్తూ స‌వ‌ర‌ణ‌ చేశామని చెప్పారు. 500 చ‌.మీ. పైబ‌డిన స్థలాలు, నిర్మాణాల్లో సెల్లారుకు అనుమ‌తి ఇస్తూ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. టీడీఆర్ బాండ్ల జారీ క‌మిటీలో రెవెన్యూ, స‌బ్ రిజిస్ట్రార్‌లు తొల‌గిస్తూ జీవో జారీ చేశామని తెలిపారు. రాష్ట్ర, జాతీయ ర‌హ‌దారిని ఆనుకుని ఉన్న స్థలాలు డెవ‌ల‌ప్ చేసేందుకు 12 మీ.స‌ర్వీస్ రోడ్డు ఏర్పాటు నిబంధ‌న తొల‌గించినట్లు చెప్పారు. బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాల సెట్ బ్యాక్ నిబంధ‌న‌ల్లో మార్పులు చేశామన్నారు. వీటితో పాటు మరిన్ని నిబంధనలు సులభం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని అన్నారు. రియల్ ఎస్టేట్ అసోసియేషన్‌ల ప్రతినిధులతో చర్చించి తుది నిబంధనలు జారీ చేసినట్లు వివరించారు. తాజా ఉత్తర్వులతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం వేగం పుంజుకోనుందని మంత్రి నారాయణ ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Mukkoti Ekadashi: తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు..

Minister K. Ram Mohan Naidu : ఏవియేషన్‌ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌

Reservation : దివ్యాంగులకు రిజర్వేషన్‌ అమలుపై ఆదేశాలివ్వండి

Read Latest AP News and Telugu News

Updated Date - Jan 10 , 2025 | 07:59 AM