AP NEWS: ఆ కేసులు బాధగా ఉన్నాయి... ముద్రగడ పద్మనాభ రెడ్డి షాకింగ్ కామెంట్స్
ABN, Publish Date - Jan 09 , 2025 | 09:35 AM
Mudragada Padmanabha Reddy: వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం అన్యాయంగా కేసులు పెడుతోందని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి అన్నారు. అధికారం శాశ్వతం కాదన్నది తెలుసుకొని లోకేష్‌కు మంచి సలహాలు ఇవ్వాలని కోరారు.
కాకినాడ: సీఎం చంద్రబాబుకు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి లేఖ రాశారు. ఏపీలో రెడ్ బుక్ పేరుతో ప్రతి నిమిషం వైసీపీ నేతలపై కేసులు పెట్టించడం బాధగా ఉందని అన్నారు. ఎందుకు ఈ రకమైన పాలన చేస్తున్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. అధికారం శాశ్వతం కాదన్నది తెలుసుకొని లోకేష్‌కు మంచి సలహాలు ఇవ్వాలని కోరారు. అంతేగాని రెచ్చిపోవద్దని చెప్పారు. రేపు జగన్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. అప్పుడు మీలా జగన్ విశ్వరూపం చూపిస్తే చాలా ప్రమాదమనే సంగతి మరువద్దని అన్నారు. జగన్ ప్రశాంతంగా ఉన్నా.. దెబ్బతిన్న వర్గం జగన్‌పై ఒత్తిడి తెస్తే ఏపీ అల్లకల్లోలం అయ్యే పరిస్థితి ఏర్పడవచ్చు అని ముద్రగడ పద్మనాభ రెడ్డి హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Tirupati Incident: తొక్కిసలాటకు కారణం ఇదే.. భక్తుల ఆవేదన
Minister Anagani: తిరుపతికి బయల్దేరిన మంత్రి అనగాని సత్యప్రసాద్
YS Jagan: తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
Read Latest AP News and Telugu News
Updated Date - Jan 09 , 2025 | 10:27 AM