Union Budget 2025: ఏపీకి అదిరిపోయే శుభవార్త... కేంద్రమంత్రి కీలక ప్రకటన

ABN, Publish Date - Feb 01 , 2025 | 03:58 PM

Ram Mohan Naidu: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి సముచిత స్థానం కల్పించారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అమరావతికి వచ్చే నాలుగేళ్లలో కూడా నిధులు వస్తాయని చెప్పారు.

Union Budget 2025: ఏపీకి అదిరిపోయే శుభవార్త... కేంద్రమంత్రి కీలక ప్రకటన
Ram Mohan Naidu

అమరావతి: కేంద్ర వార్షిక బడ్జెట్ (2025-26)ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ(శనివారం) ప్రకటించారు . మొత్తం రూ.50,65,345 కోట్లతో ప్రవేశపెట్టారు. శాఖల వారీగా చూసుకుంటే.. రక్షణ శాఖకు ఏకంగా రూ.4.91 లక్షల కోట్లు కేటాయించారు. ఆ తర్వాత గ్రామీణ శాఖకు రూ.2.66 లక్షల కోట్లు కేటాయించారు. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ మీద కేంద్రప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ఏపీకి ప్రత్యేకంగా కేటాయింపులు చేసింది. పోలవరం ప్రాజెక్టుకు గతేడాది కంటే రూ.400 కోట్లు కేటాయించ్చింది. మొత్తంగా రూ.5,936 కోట్లు ఇస్తున్నట్లు బడ్జెట్‌‌లో పేర్కొంది. విశాఖపట్నం పోర్టుకు కూడా గతేడాదితో పోలిస్తే రూ.445 కోట్లు అధికంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. మొత్తంగా విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు కేటాయించింది. అయితే ఏపీకి బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వడంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు.


ప్రజల తరఫున నిర్మల సీతారామన్‌కు కృతజతలు తెలిపారు. లాజిస్టిక్ హబ్‌గా ఏపీని అభివృద్ధి చేస్తామని అన్నారు. జల్ జీవన్ మిషన్‌లో భాగంగా ప్రతి ఇంటికీ తారునీరు అందిచాలన్నది ప్రధానమంత్రి నరేంద్రమోదీ కల అని తెలిపారు. 2028 వరకు జల్ జీవన్ మిషన్ పొడిగింపుతో ఏపీకి ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఫలితాలు ఎలా ఉంటాయో ప్రజలు చూస్తున్నారని రామ్మోహన్‌నాయుడు అన్నారు.


అమరావతికి వచ్చే నాలుగేళ్లలో కూడా నిధులు వస్తాయని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో జల్ జీవన్ నిధులు దుర్వినియోగం చేశారని విమర్శించారు. 2028 వరకు జల్ జీవన్ పొడిగింపుతో ఏపీకి మేలు జరుగుతుందని అన్నారు. ఏపీకి సముచిత న్యాయం చేసేలా టీమ్ వర్క్ చేస్తామని చెప్పారు. ఎంత వీలయితే అంత మొత్తంలో ఏపీకి నిధులు తెస్తామని అన్నారు. పౌరవిమానరంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. వుడాన్ స్కీమ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారని తెలిపారు. ఏపీలో అదనంగా మరో 7 ఎయిర్‌పోర్టులు రాబోతున్నాయని రామ్మోహన్‌నాయుడు ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి

CII on Budget 2025: దేశానికి ప్రోత్సాహకంగా బడ్జెట్.. సీఐఐ రియాక్షన్

Union Budget 2025-26: ఏపీ జీవనాడికి ఊపిరి పోసిన నిర్మలమ్మ

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 01 , 2025 | 04:21 PM