Minister Narayana: రాజధాని అమరావతికి మళ్లీ గుడ్ న్యూస్
ABN, Publish Date - Jan 22 , 2025 | 03:20 PM
AP Capital Amaravati: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని అమరావతి నిర్మాణానికి హడ్కో భారీగా రుణం మంజూరు చేసేందుకు సానుకూలంగా స్పందించింది.

అమరావతి, జనవరి 22: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని నిర్మాణానికి రూ.11 వేల కోట్లు విడుదల చేయాలని హుడ్కో నిర్ణయించింది. ఈ మేరకు ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి. నారాయణ స్పష్టం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి హడ్కో ద్వారా రూ.11 వేల కోట్ల రుణం కోసం తమ ప్రభుత్వం సంప్రదింపులు జరిపిందని ఆయన గుర్తు చేశారు. ఈ సంప్రదింపులతో హడ్కో సానుకూలంగా స్పందించిందన్నారు. ఈ హడ్కో నిర్ణయంతో రాజధాని అమరావతి పనులు వేగవంతమవుతాయని ఆయన స్పష్టం చేశారు.
గతేడాది మే, జూన్ మాసంలో జరిగిన అసెంబ్లీ ఎన్నిక్లలో కూటమికి ఆంధ్రప్రదేశ్ ఓటరు పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో గత ఐదేళ్లుగా.. అంటే 2019 నుంచి 2024 మే మాసం వరకు వైసీపీ పాలనలో రాష్ట్ర రాజధాని ఏదో.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియని పరిస్థితి నెలకొంది.
అలాంటి వేళ.. 2024 ఎన్నికల్లో రాష్ట్ర ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో.. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అంతేకాదు.. రాజధాని అమరావతితోపాటు రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి తాము సైతం సహాయ సహకారాలు అందిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేతలు, ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సైతం ప్రకటించిన విషయం విధితమే.
ఇక కేంద్రంలో ఎన్డీయే సర్కార్, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరడంతో.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కేంద్ర బడ్జెట్‌లో సైతం అమరావతి నిర్మాణానికి నిధులు సైతం కేటాయిస్తోంది. ఇక దేశీ, విదేశీ సంస్థలు సైతం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు ఆయన కేబినెట్ సహచరులు దావోస్‌లో పర్యటిస్తున్నారు.
ఇంకోవైపు గత ఐదేళ్లలో రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు జరగలేదు. సరికద.. ఉన్న పరిశ్రమ అమర రాజా సైతం పక్క రాష్ట్రానికి తరలిపోయింది. అలాగే లూలు సంస్థ సైతం గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. కానీ చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తిరిన అనంతరం విశాఖ, తిరుపతి, విజయవాడలల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ సానుకూలంగా స్పందించింది. అలాంటి వేళ.. రాజధాని నిర్మాణానికి హుడ్కో నిధులు కేటాయించడం వల్ల.. ఆ ప్రాంతం మరింత త్వరితగతిన అభివృద్ధి చెందుతోందని అక్కడి వాసులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
For AndhraPradesh New And Telugu News
Updated Date - Jan 22 , 2025 | 03:28 PM