Gorantla Madhav: మరిన్ని చిక్కుల్లో గోరంట్ల మాధవ్.. వారి ఫిర్యాదుతో..

ABN, Publish Date - Feb 28 , 2025 | 01:50 PM

Gorantla Madhav Case: వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఆయనపై రెండు పార్టీల నేతలు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న గోరంట్ల ఇక ముందు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Gorantla Madhav: మరిన్ని చిక్కుల్లో గోరంట్ల మాధవ్.. వారి ఫిర్యాదుతో..
Gorantla Madhav

అనంతపురం: అత్యాచార బాధితుల పేర్లు బహిర్గతం చేసిన కేసులో వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నోటీసులు అందుకున్నారు. విజయవాడ సైబర్‌క్రైమ్ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఆల్రెడీ నోటీసులు అందుకున్న గోరంట్ల.. ఇప్పుడు మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఆయన చేసిన అంతర్యుద్ధం వ్యాఖ్యలపై టీడీపీ, జనసేన సీరియస్ అయ్యాయి. ఈ విషయంపై ఎస్పీకి ఫిర్యాదు చేశాయి. మాధవ్ మీద చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీ జగదీష్‌కు ఆ రెండు పార్టీలు కంప్లయింట్ చేశాయి. రాష్ట్రంలో అలజడులు సృష్టించి.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదులో తెలిపాయి టీడీపీ, జనసేన. అంతేగాక గోరంట్లపై రాజద్రోహం కేసు వేయాలని డిమాండ్ చేశాయి.


అనుచిత వ్యాఖ్యలతో..

గోరంట్ల మాధవ్ గతేడాది చేసిన పలు వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన్ను చిక్కుల్లో పడేశాయి. 2024, అక్టోబర్ 21న అనంతపురంలోని తన ఇంట్లో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొన్ని ఏరియాల్లో అత్యాచారం, హత్యకు గురైన బాధితుల పేర్లను ఆయన బహిర్గతం చేశారు. దీంతో అదే ఏడాది నవంబరు 2న విజయవాడ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ. సెక్షన్ 23 (4) ఆఫ్ పోక్సో, బీఎన్‌ఎస్‌ఎస్ 72, 79 సెక్షన్ల కింద గోరంట్ల మీద కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఇదే కేసులో సైబక్‌క్రైమ్ పోలీసులు ఆయన్ను విచారించనున్నారు.


ఇవీ చదవండి:

అన్నింటిలో డ్రాప్‌ అవుట్‌లే.. ఆకట్టుకున్న పయ్యావుల బడ్జెట్ ప్రసంగం

వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్న

అభివృద్ధి పథకాలకు భారీగా కేటాయింపులు..

మరిన్ని ఏపీ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 28 , 2025 | 01:50 PM