Share News

పోరుమామిళ్లలో కార్డెన సెర్చ్‌

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:04 AM

పోరుమా మిళ్ల మండలంలోని రం గసముద్రం పంచాయతీ సుందరయ్యకాలనీలో పో లీసులు కార్డెన సెర్చ్‌ నిర్వహించారు.

పోరుమామిళ్లలో కార్డెన సెర్చ్‌
సుందరయ్యకాలనీవాసులతో మాట్లాడుతున్న సీఐ శ్రీనివాసులు

పోరుమామిళ్ల, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): పోరుమా మిళ్ల మండలంలోని రం గసముద్రం పంచాయతీ సుందరయ్యకాలనీలో పో లీసులు కార్డెన సెర్చ్‌ నిర్వహించారు. ఇందులో భాగ ంగా ఆయా కాలనీల్లో తనిఖీ నిర్వహించారు. ఎవ రైనా కొత్త వ్యక్తులు అను మానాస్పదంగా ఉన్నారేమోనని సోదాలు నిర్వహించారు. ఎటువంటి రికార్డు లు లేని వాహనాలు చెక్‌ చేసి ఆరు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. అనం తరం కాలనీవాసులతో సమావేశం నిర్వహించి ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ, అనుమానాస్పద వ్యక్తులు కానీ ఈ ఏరియాలో కనిపించినట్లయితే పోలీసు లకు సమాచారం ఇవ్వాలన్నారు. అలాగే లాడ్జిలలో తనిఖీలు చేసి లాడ్జికి వచ్చేవారి ప్రతి ఒక్కరి చిరునామా నమోదు చే సుకోవాలన్నారు. సీసీ కెమెరాలు తప్పక ఏర్పాటు చేసుకోవాల న్నారు. పోరుమామిళ్ల సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ కొండారెడ్డి పాల్గొన్నారు.

గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు

కొండాపురం, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): గ్రామాలలో గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కొండాపురం సీఐ మహమ్మద్‌రఫీ, తాళ్లప్రొ ద్దుటూరు ఎస్సై హృషికేశ్వర్‌రెడ్డిలు హెచ్చరించారు. మండలంలోని టీ.కోడూరు. సంకేపల్లె గ్రామాల్లో మంగళవారం తమ సిబ్బందితో కలిసి వారు విస్తృతంగా తనిఖీలు నిర్వ హించారు అనంతరం నిర్వహించిన గ్రామసభలలో వారు మాట్లాడారు. చిన్న చిన్న సమస్యలు వస్తే తమ దృష్టికి తేవాలన్నారు. ప్రశాంత జీవనానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు కోరారు.

దొమ్మరనంద్యాలలో పోలీసుల తనిఖీలు

మైలవరం, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని దొమ్మరనంద్యాల గ్రామంలో మంగళవారం జమ్మలమడుగు రూరల్‌ సీఐ గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. గడ్డివాముల్లో, పలు ఇళ్లలో సోదాలు నిర్వహించడంతోపాటు రికార్డులు లేని వాహనాలను తనిఖీలు చేశారు. అనంతరం శివారెడ్డి కాలనీలో గ్రామస్థులకు సమావేశం నిర్వహించి మైలవరం జలాశయం నుంచి కాలువల్లో ప్రవహిస్తున్న నీటిలో ఈత కొట్టేందుకు పిల్లలు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలన్నారు. అలాగే లైసెన్సులు లేకుండా వాహనాలను రోడ్డుపై తిప్పరాదన్నారు. కార్యక్రమంలో మైలవరం, తలమంచిపట్నం ఎస్‌ఐలు శ్యాంసుందర్‌రెడ్డి, లక్ష్మినారాయణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 12:04 AM