ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ACB RAIDS: ఫార్ములా ఈ కార్ రేస్.. ఏపీలో సోదాలు

ABN, Publish Date - Jan 07 , 2025 | 02:16 PM

ACB RAIDS: ఫార్ముల ఈ కార్ రేసు కేసుకు సంబంధించి అధికారులు తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. ఏపీలోని మచిలిపట్నంలోనూ అధికారులు సోదాలు చేశారు. పలు కీలక డ్యాంకుమెట్లనూ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ACB RAIDS

అమరావతి: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ (Formula E Race Case) కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ హైకోర్టు తీర్పుతో ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ రేసు కేసులో దూకుడు పెంచారు. ఫార్ములా-ఈ కేసులో పలుచోట్ల ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి సోదాలు చేపట్టారు. ఈ కేసుతో ఆంధ్రప్రదేశ్‌తోనూ లింక్ ఉందని అధికారులు గుర్తించారు. దీంతో ఏసీబీ అధికారులు ఇవాళ(మంగళవారం) ఏపీకి వెళ్లి సోదాలు నిర్వహించారు. పలు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి కీలక డాంక్యుమెట్లను స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మచిలీపట్నంలో ఏస్ అర్బన్ డెవలపర్స్ కార్యాలయంలోకి ఏసీబీ అధికారులు ప్రింటర్లు తీసుకువెళ్లారు. పలు డాక్యుమెంట్లను ఏసీబీ బృందం కాపీలు తీసుకుంటున్నారు.


మొత్తం 12 మంది ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ కార్ రేస్‌కు సంబంధించి నిధులు ఏ అకౌంట్ నుంచి వచ్చాయనే అంశంపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. సిబ్బందిని అడిగి పలు వివరాలు సేకరిస్తున్నారు. తెలంగాణ నుంచి వచ్చిన ఏసీబీ ఉన్నతాధికారుల బృందం తనిఖీలు చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఏసీబీ బృందం ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. చలమశెట్టి సునీల్‌కు చెందిన గ్రీన్కో అనుబంధ సంస్థ అని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. చలమశెట్టీ సునీల్ జన్మస్థలం కృష్ణా జిల్లా మచిలీపట్నం. సునీల్ తల్లి వెంకటలక్ష్మి గతంలో బందర్ మున్సిపల్ చైర్మన్‌గా పనిచేశారు. తెలంగాణ నుంచి ఉదయాన్నే ఏసీబీ బృందం అధికారులు వచ్చారు. పై అధికారుల ఆదేశాల మేరకే తాము సోదాలు చేస్తున్నామని తెలంగాణ ఏసీబీ అధికారులు తెలిపారు.

Updated Date - Jan 07 , 2025 | 02:17 PM