AP News: ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ
ABN , Publish Date - Jan 30 , 2025 | 07:00 AM
నిరుపేదలకు మేలు చేసే మరో కీలక నిర్ణయం కూటమి సర్కారు తీసుకుంది. నివాసం కోసం పేదలు ఆక్రమించుకొని ఇళ్లు నిర్మించుకున్న ప్రభుత్వ భూముల్లో అభ్యంతరం లేని వాటిని క్రమబద్ధీకరించాలని రెవెన్యూశాఖను ఆదేశించింది. ఈ మేరకు క్రమబద్ధీకరణకు అనుమతి ఇస్తూ రెవెన్యూశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు (Government land regularization) సంబంధించి సర్కార్ విధివిధానాలు ఖరారు చేసింది. ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (Scheme) 2025 పేరిట ఆక్రమించుకున్న భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి నిబంధనలు జారీ చేసింది. ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వులన్నింటిని పక్కన పెడుతూ జీవో నెంబర్ 30ని జారీ చేసింది.
ఈ వార్త కూడా చదవండి..
జగన్ పత్రిక రోత రాతలపై సీఐడీ కదలాలి
150 గజాల వరకూ ఉచితం...
2019 అక్టోబర్ 15 తేదీని కట్ ఆఫ్ డేట్‌గా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తేదీ కంటే ముందు ఆక్రమిత స్థలాల్లో నివాసం ఉంటేనే క్రమబద్ధీకరణ దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పించింది. మాస్టర్ ప్లాన్, జోనల్ ప్లాన్‌లో నిర్దేశిత స్థలాలు, లే అవుట్ స్థలాలు, కాలువలు, నదీ ప్రవాహ గట్లు, ఇతర జలవనరులకు సంబంధించిన స్థలాల్లో క్రమబద్ధీకరణ సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఖాళీ స్థలాలు, వాటిలో తాత్కాలిక ఇళ్లు కట్టుకున్నా క్రమబద్ధీకరణకు అనర్హులని పేర్కొంటూ మార్గదర్శకాలు జారీ చేసింది. 150 గజాల వరకూ ఉచితంగానే క్రమబద్ధీకరణ చేయనున్నట్టు వెల్లడించింది. 301 గజాల కంటే ఎక్కువ భూమి ఆక్రమణలో ఉంటే సాధారణ రిజిస్ట్రేషన్ విలువతోనే క్రమబద్ధీకరణ చేసేందుకు అవకాశం కల్పిస్తూ.. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు.
దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలు (బీపీఎల్) ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని ఇళ్లు, గుడిసెలు వేసుకొని ఉంటే అందులో 150 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరిస్తారు. పేదలు కాని వారు ఉన్నా 150 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరిస్తారు. దీనికోసం ఈ ఏడాది డి సెంబరు 31 వరకు గ్రామ,వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలి. వీటిపై గ్రామ వీఆర్‌వో, వార్డు అధికారులు విచారణ జరిపి ఆయా ప్రాంతాలను బట్టి తహసిల్దార్, ఆర్‌డీవో, మున్సిపల్ కమిషనర్లకు నివేదికలు ఇస్తారు. వాటిని సబ్ డివిజనల్ కమిటీలో చర్చించి ఆమోదిస్తారు. ఆ తర్వాత లబ్ధిదారుల ఎంపికపై ఆదేశాలు ఇస్తారు. వాటి ఆధారంగా తహసిల్దార్ కన్వేయెన్స్ డీడ్‌ల రూపంలో క్రమబద్ధీకరణ ఉత్తర్వులు ఇస్తారు. రెండేళ్ల తర్వాత లబ్ధిదారులకు ఆ భూములపై శాశ్వత హక్కులు ఇస్తారు. ఇదిలాఉండగా, గతంలో జగన్ సర్కారు వద్ద దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నవారు,అసలు దరఖాస్తు చేసుకోనివారు కూడా ఇప్పుడు తాజాగా దరఖాస్తు చేసుకోవచ్చునని రె వెన్యూశాఖ మార్గదర్శకాల్లో పేర్కొంది.
వాయుదాల్లో ఫీజుల చెల్లింపు
ఇంటిస్థలాల క్రమబద్ధీకరణకు ఎంపికై న వారు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులను రెండు వాయిదాల్లో చెల్లించేలా వెసులుబాటు కల్పించారు. సీఎఫ్‌ఎమ్‌ఎస్‌లో ఫీజులు చెల్లింపు ఉంటుందని రెవెన్యూశాఖ తెలిపింది. భూముల బేసిక్ విలువను జిల్లా కలెక్టర్ ఖరారు చేస్తారని పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
చీకట్లో తొక్కిసలాట.. 40 మంది దుర్మరణం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News