AP Fiber Net: ఏపీ ఫైబర్‌నెట్‌లో ఉద్యోగులపై సర్కార్ షాకింగ్ డెసిషెన్
ABN , Publish Date - Apr 16 , 2025 | 12:36 PM
AP Fiber Net: ఏపీ ఫైబర్ నెట్‌కు సంబంధించి సర్కార్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. వైసీపీ నేతలు చెప్పిన వారినందరినీ గతంలో అప్పటి యాజమాన్యం ఫైబర్ నెట్‌లో చేర్చుకుంది.

అమరావతి, ఏప్రిల్ 16: ఏపీ ఫైబర్ నెట్‌కు (AP Fiber Net) సంబంధించి ప్రభుత్వం(AP Govt)కీలక నిర్ణయం తీసుకుంది. ఫైబర్ నెట్‌లో దాదాపు 500 మంది ఉద్యోగులను సర్కార్ తొలగించింది. సూర్య ఎంటర్‌ప్రైజెస్ ద్వారా నియమించిన వారందరు కూడా ఈ నెలాఖరుకు ఫైబర్ నెట్ నుంచి ఔట్ అవనున్నారు. ఇక ముందు ఎటువంటి పొడిగింపు ఉండబోదని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. వైసీపీ నేతలు చెప్పిన వారినందరినీ గతంలో అప్పటి యాజమాన్యం ఫైబర్ నెట్‌లో చేర్చుకుంది. పులివెందుల, కడప జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వారిని ఉద్యోగులుగా చేర్చిన అంశంపై అప్పట్లోనే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చింది.
ఈ ఉద్యోగులంతా కూడా ఫైబర్ నెట్ కార్యాలయానికి రాకుండా జీతాలు తీసుకున్న పరిస్థితి. దీనిపై దృష్టిసారించిన కూటమి ప్రభుత్వం దాదాపు 500 మందిని ఫైబర్ నెట్ నుంచి తొలగించింది. కాగా.. ఏపీ ఫైబర్ నెట్ అంటే అప్పట్లో టీడీపీ హయాంలో సంచలనమే అనే చెప్పుకోవాలి. అతి తక్కువ ధరకు కేబుల్, నెట్, ఫోన్ సేవలను అందించింది అప్పటి టీడీపీ సర్కార్. తక్కువ ధరకే నెట్ రావడంతో ఏపీలో పెద్ద సంఖ్యలో కనెక్షన్లు తీసుకున్నారు ప్రజలు. అయితే టీడీపీ ప్రభుత్వం పోయి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీ ఫైబర్ నెట్‌ను అన్ని విధాలుగా నిర్వీర్యం చేశారని చెప్పుకోవచ్చు. అవినీతి, అక్రమాలతో ఏపీ ఫైబర్ నెట్ పాతాళంలోకి నెట్టేసింది గత వైసీపీ ప్రభుత్వం. ఏపీ ఫైబర్ నెట్ అంతా అప్పులమయంగా మారిపోయింది.
Saraswati Pushkaralu 2025: తెలంగాణలో పుష్కరాలకు వేళాయె.. ప్రత్యేక మొబైల్ యాప్ మీకోసమే
అయితే వైసీపీ హయాంలో పెద్దల అండదండలతో అనేక మంది ఫైబర్ నెట్‌లో జాయిన్ అయి తమ ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడ్డారు. పీకల్లోతు అప్పులో కూరుకుపోవడంతో పాటు కనెక్షన్లు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. ఇప్పటికీ కూడా వారే ఇంకా ఉండటంతో పాటు సిబ్బంది కూడా వారే ఉండటంతో విమర్శలు వెల్లువెత్తాయి. వైసీపీ జమానా వారే ఉండటంతో కూటమి ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయాలు కూడా అమలు కాని పరిస్థితి. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో ఇందులో జరిగిన అక్రమాలను బయటపెట్టేందుకు విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.5400 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరుగగా.. దాదాపు రూ.500 కోట్లు అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది.
మరోవైపు వైసీపీ హయాంలో నియమితులైన ఉద్యోగులు కార్యాలయం మొహమే చూడని పరిస్థితి. అంతే కాకుండా ఉద్యోగానికి రాకున్నప్పటికీ వారికి జీతాలు మాత్రం చెల్లించేవారు. ఈ విషయం కూడా విచారణలో బయటపడింది. ఈ క్రమంలో గత ప్రభుత్వంలో నియమితులైన వారందరినీ పూర్తిగా ఉద్యోగాల నుంచి తొలగించాలని సర్కార్ నిర్ణయించింది. అందులో భాగంగా ఏపీ ఫైబర్ నెట్‌లో దాదాపు 500 మంది ఉద్యోగాలను తొలగించింది సర్కార్.
ఇవి కూడా చదవండి
Supreme Court: సెలవుల్లో బుల్డోజర్లు దింపాల్సిన అవసరం ఏంటి.. సర్కార్‌కు సుప్రీం సూటి ప్రశ్న
Amaravati Development Plan: అమరావతిపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన మంత్రి
Read Latest AP News And Telugu News