Share News

AP Inter Results 2025: ఇంటర్ ఫలితాలు త్వరగా తెలుసుకోవాలంటే దీనిపై క్లిక్ చేయండి

ABN , Publish Date - Apr 12 , 2025 | 11:45 AM

AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాలను మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ఎక్స్‌లో విడుదల చేశారు. ఫలితాలను త్వరగా తెలుసుకోవాలనుకునే విద్యార్థులు ఈ వెబ్‌సైట్‌ను క్లిక్ చేసేయండి.

AP Inter Results 2025: ఇంటర్ ఫలితాలు త్వరగా తెలుసుకోవాలంటే దీనిపై క్లిక్ చేయండి
AP Inter Results 2025

అమరావతి, ఏప్రిల్ 12: ఏపీ ఇంటర్ ఫలితాలు (AP Inter Result 2025) వచ్చేశాయి. శనివారం ఉదయం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను రిలీజ్ చేశారు. ఇంటర్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. bie.ap.gov.in లేదా resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌లో ఇంటర్ ఫలితాలను చెక్‌ చేసుకుని మీ రిజల్ట్స్‌ను తెలుసుకోండి. ముందుగా ఏపీ ఇంటర్ రిజల్ట్స్ కోసం bie.ap.gov.in వెబ్‌ సైట్‌ను ఓపెన్ చేయండి. హోం పేజీలో AP Inter Results 2025 లింక్‌పై క్లిక్ చేయండి. ఆ తరువాత మీ హాల్‌ టికెట్, పుట్టిన తేదీని ఎంటర్ చేయాలి. ఆ వెంటనే ఫలితాలు వచ్చేస్తాయ్.


Inter Results: ప్రయోగాత్మకంగా ఇంటర్ ఫలితాలు.. విడుదల చేసిన మంత్రి లోకేష్

కాగా.. ఇంటర్ ఫలితాల్లో గతేడాది కంటే కూడా ఈ ఏడాది అత్యధికంగా ఉత్తీర్ణత శాతం నమోదు అయ్యింది. మొదటి సంవత్సరం 70 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. రెండో సంవత్సరంలో 83 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. మార్చి 1 నుంచి 10 వరకూ 1535 పరీక్షా సెంటర్లలో ఇంటర్ ప్రధమ, ద్వీతీయ సంవత్సర పరీక్షలు జరిగాయి. మార్చి 17 నుంచి ఏప్రిల్ 5 వరకూ 25 క్యాంపులలో మూల్యాంకనం నిర్వహించారు. మొదటి సంవత్సరం పరీక్షలకు జనరల్, ఓకెషనల్, ప్రైవేట్ కలిపి 5 లక్షల 25 వేల 848 మంది విద్యార్ధులు హజరుకాగా.. ద్వితీయ సంవత్సరానికి 4 లక్షల 91వేల 254 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు10 లక్షల 17వేల 102 మంది విద్యార్థులు హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి

Tirumala Temple Incident: తిరుమలలో అపచారం.. ఏం జరిగిందంటే

Inter Results: ఏపీలో ప్రయోగాత్మకంగా ఇంటర్ ఫలితాలు..

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 12 , 2025 | 11:49 AM