బోలెం రామారావుకు జాతీయ బంగారు నంది అవార్డు
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:42 AM
ప్రముఖ రంగస్థల కళాకారుడు, విక్రమార్కు డు సినిమా ఫేం బోలెం రామారావుకు ఉగాది, మహనీయుల ప్రత్యేక అవార్డుగా జాతీయ బం గారు నంది అవార్డు - 2025 లభించింది.

చల్లపల్లి, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ రంగస్థల కళాకారుడు, విక్రమార్కు డు సినిమా ఫేం బోలెం రామారావుకు ఉగాది, మహనీయుల ప్రత్యేక అవార్డుగా జాతీయ బం గారు నంది అవార్డు - 2025 లభించింది. ఉగాది, అంబేడ్కర్ జయంతి అవార్డు ప్రత్యేక వేడుకల పేరుతో హైదరాబాద్‌కు చెందిన జీసీఎస్ వల్లూరి ఫౌండేషన్ ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో రామారావును సన్మానించి బంగారు నందిని అందించారు. ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వీఆర్ శ్రీనివాసరాజు, తెలంగాణ సాంస్కృతికశాఖ చైర్మన్, గద్దర్ కుమార్తె వెన్నెల, ఫిలిం చాంబర్ అధ్యక్షుడు రామకృష్ణాగౌడ్, నటుడు దొరైస్వామిల, దైవ జ్ఞ శర్మల నుంచి రామారావు అవార్డును అందుకున్నారు. పలువురు కళాకారులు, కళాభిమానులు రామారావుకు అభినందనలు తెలిపారు.