తాగునీటి సమస్య పరిష్కరించండి
ABN , Publish Date - Mar 31 , 2025 | 12:46 AM
కొండపర్వ గ్రామంలోని ఆరో వార్డులో తాగునీటి సమస్య పరిష్కరించాలని మహిళలు డిమాండ్ చశారు.

విస్సన్నపేట, మార్చి 30(ఆంధ్రజ్యోతి): కొండపర్వ గ్రామంలోని ఆరో వార్డులో తాగునీటి సమస్య పరిష్కరించాలని మహిళలు డిమాండ్ చశారు. ఆదివారం ఖాళీ బిందెలతో వారు నిరసన తెలిపారు. పంచాయతీ వారు సరఫరా చేసే నీరు అరకొరగా రావడంతో ఇబ్బందులు పడుతున్నామని, సమస్య పరిష్కరించి, తాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.