Big Shock: వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు..
ABN , Publish Date - Apr 08 , 2025 | 12:14 PM
వైఎస్సార్‌సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టులో మరోసారి షాక్ తగిలింది. ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు వంశీని జైలుకు తరలించనున్నారు.

విజయవాడ: సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు (Satyavardhan kidnapping case)లో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత (YCP Leader) వల్లభనేని వంశీమోహన్‌కు (Vallabhaneni Vamsi) న్యాయస్థానం మరోసారి రిమాండ్ పొడిగించింది (Remand extended). అతని కస్టడీ ముగియడంతో మంగళవారం పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ( SC ST special court) ముందు హాజరు పరిచారు. విచారణ జరిపిన కోర్టు ఈనెల 22వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సత్య వర్ధన్ కిడ్నాప్ కేసుతో పాటు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.
Also Read..: అమ్మాయితో రాజకీయమా..
కాగా ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మిగిలిన నిందితులు నేపాల్లో తిరుగుతున్నట్లు తెలిసింది. ఈ కేసులో ఇంకా అరెస్టు కావలసిన ప్రధాన నిందితుల్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరుడు కొమ్మా కోటేశ్వరరావు అలియాస్ కోట్లు ఒకరు. అతడితోపాటు మరి కొంతమంది నేపాల్లో ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది.ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులు ఉండగా.. వంశీ, వెలినేని శివరామకృష్ణ ప్రసాద్, గంటా వీర్రాజు, నిమ్మ చలపతి, వేల్పూరు వంశీబాబులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాళ్లంతా విజయవాడలోని జిల్లా జైల్లో ఉన్నారు. ఏ-5గా ఉన్న ఓలుపల్లి మోహనరంగారావు అలియాస్ రంగాను గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారంలో సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అతడిని కిడ్నాప్ కేసులో పీటీ వారెంటుపై కోర్టులో హాజరుపరచడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ కేసులో రంగాతోపాటు కోట్లుదీ సమాన పాత్ర. సత్యవర్ధన్‌కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని కోట్లే సేకరించి రంగాతో పంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వంశీని అరెస్టు చేసిన మరుక్షణమే ఇద్దరూ ఊరు దాటేశారు.
రంగా ఇటీవల ఏలూరులో సీఐడీ బృందానికి దొరికిపోయాడు. మిగతా ఆరుగురిలో విశాఖకు చెందిన ఇద్దరు నిందితులు శ్రీకాకుళం వైపు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. నేపాల్లో తలదాచుకున్న కోట్లు, మరో ముగ్గురు.. అక్కడి నుంచే సన్నిహితులకు ఫోన్ చేసి కేసు విషయాలను, పోలీసుల కదలికలను తెలుసుకుంటున్నట్లు సమాచారం. కోట్లు రాత్రి సమయాల్లో ఫోన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. నలుగురూ నేపాల్లో ఎక్కడుంటున్నారో ఆరా తీస్తున్నాయి. పక్కా వివరాలు అందగానే అరెస్టు చేసే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సీతమ్మవారికి తాళి కట్టిన వైసీపీ ఎమ్మెల్యే
సాయంత్రం వేళ ఈ వస్తువులు దానం చేయవద్దు..
భోజనం చివరిలో పెరుగు ఎందుకు తినాలంటే..
For More AP News and Telugu News