Share News

తొక్కిసలాటలో 140 గొర్రెల మృతి

ABN , Publish Date - Mar 29 , 2025 | 11:24 PM

మండల కేంద్రమైన పగిడ్యాల మజార గ్రామమైన ఆంజనేయనగర్‌ సమీపంలో గొర్రెలు తొక్కిసలాటలో శనివారం 140కి పైగా గొర్రెలు మృతి చెందినట్లు బాధితులు మోహన్‌, సుధాకర్‌, బాలస్వామి తెలిపారు. వివరాలివీ.. తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం సగినేనిపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు సుమారు 900 గొర్రెలను మేత కోసం జనవరి నెలలో పగిడ్యాలకు వచ్చారు.

తొక్కిసలాటలో 140 గొర్రెల మృతి
మృతిచెందిన గొర్రెలను పరీశీలిస్తున్న పశు వైద్యాధికారులు

పగిడ్యాల, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రమైన పగిడ్యాల మజార గ్రామమైన ఆంజనేయనగర్‌ సమీపంలో గొర్రెలు తొక్కిసలాటలో శనివారం 140కి పైగా గొర్రెలు మృతి చెందినట్లు బాధితులు మోహన్‌, సుధాకర్‌, బాలస్వామి తెలిపారు. వివరాలివీ.. తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం సగినేనిపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు సుమారు 900 గొర్రెలను మేత కోసం జనవరి నెలలో పగిడ్యాలకు వచ్చారు. పగిడ్యాల చుట్టు ప్రక్కల గ్రామాలలోని పంట పొలాలలో జీవాలను మేపుకుంటు ఉండేవారు. రోజులాగే గొర్రెల మందను తీసుకొని ఆంజనేయనగర్‌ గ్రామ సమీపంలోని కేసీ కాలువ వెంట వెళ్లారు. సాయంత్రం కేసీ కాలువ నుంచి సమీపంలోని పొలాలలోకి మందను తీసుకొని సుజాత అనే కాపరి వెళ్తుండగా ప్రమాదవశాత్తు కింద పడటంతో గొర్రెలు భయంతో పరుగులు తీస్తూ తొక్కిసలాడటంతో సుమారు 140 గొర్రెలు మృతి చెందాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 20 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని చెప్పారు. పశుసంవర్థకశాఖ ఏడీ రామంజులునాయక్‌, పగిడ్యాల పశువైద్యాధికారి శృతి కీర్తి చేరుకొని బాదితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనతరం మృత్యువాతపడిన గొర్రెలకు పోస్టుమార్టం నిర్వహించారు.

Updated Date - Mar 29 , 2025 | 11:24 PM