మఠానికి 1.50 కేజీల వెండి హారం
ABN , Publish Date - Apr 16 , 2025 | 01:13 AM
మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి బెంగళూరు చెందిన భాస్కర్‌రావు అనే భక్తుడు రూ.1.50 కేజీల వెండితో తయారు చేసిన హారాన్ని విరాళంగా అందజేశారు.

మంత్రాలయం, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి బెంగళూరు చెందిన భాస్కర్‌రావు అనే భక్తుడు రూ.1.50 కేజీల వెండితో తయారు చేసిన హారాన్ని విరాళంగా అందజేశారు. మంగళవారం కుటుంబ సమేతంగా రాఘవేంద్రస్వామిని దర్శించుకొని మఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులకు ప్రత్యేకంగా, సుంద రంగా ఆకర్షణీయంగా తయారు చేయించిన హారాన్ని అందజేశారు. ఈ హారాన్ని పూర్వపు పీఠాధిపతి సుశమీంద్రతీర్థుల బృందావనానికి అలం కరణ చేయాలని దాత కోరారు. విరాళమిచ్చిన భక్తులకు, దాతలకు పీఠాధిపతి రాఘవేంద్రస్వామి మెమెంటో, శేషవస్త్రం, ఫలపుష్ఫ మంత్రా క్షితలు, పరిమళ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మఠం ఏఏవో మాధవశెట్టి, మఠం మేనేజర్లు వెంకటేశ జోషి, సురేష్ కోనాపూర్, శ్రీపతాచార్, ఐపీ నరసింహమూర్తి పాల్గొన్నారు.