Share News

అధరహో

ABN , Publish Date - Apr 05 , 2025 | 12:10 AM

వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి ధర శుక్రవారం ఆధర హో అనిపించింది.

 అధరహో

పత్తి క్వింటా గరిష్ఠంగా రూ.8,019

రైతుల్లో సంతోషం

ఆదోని అగ్రికల్చర్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి ధర శుక్రవారం ఆధర హో అనిపించింది. శుక్రవారం పత్తి ధర క్వింటా గరిష్ఠంగా రూ.8019 చేరుకోవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌లోనే ఈ ధర రికార్డ్‌. పంట చేతికి వచ్చే సమయానికి ధరలు పతనమై కనీస మద్దతు ధర కంటే తక్కువగా పలికాయి. దీంతో సీసీఐకి పత్తి రైతులు తమ పత్తిని మద్దతు ధరకు విక్రయించుకున్నారు. రైతులు 90శాతం పైగా పత్తి దిగుబడులు విక్రయించుకున్నాక మళ్లీ ధరలు పెరుగుతండడంతో కొందరు నిరాశ చెందుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దూది పత్తి దింజల ధరలు పెరగడం వల్ల స్థానిక మార్కెట్‌లో ధరలు పెరగడానికి కారణం అయిందని కాటన్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ సభ్యుడు నీలకంఠ తెలిపారు. మరికొంత స్వల్పంగా పత్తి ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు. 659 క్వింటాళ్ల పత్తి విక్రయానికి రాగా వాటి కనిష్ఠ ధర రూ.5016, మధ్యస్థ ధర రూ.7678 పలికింది.

Updated Date - Apr 05 , 2025 | 12:10 AM