విద్యార్థులందరూ బడిలో ఉండాలి: డీఈవో
ABN , Publish Date - Apr 16 , 2025 | 12:26 AM
ఒక్క విద్యార్థి కూడా బడి బయట ఉండకూడదని, వారందరూ బడిలో ఉండాలని డీఈవో శామ్యూల్ పాల్ అన్నారు.

గూడూరు, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): ఒక్క విద్యార్థి కూడా బడి బయట ఉండకూడదని, వారందరూ బడిలో ఉండాలని డీఈవో శామ్యూల్ పాల్ అన్నారు. మంగళవారం డీఈవో గూడూరు మండలంలో పర్యటించి డ్రాపౌట్‌గా ఉన్న విద్యార్థులు పాఠశాలల్లో చేరారా? లేదా? అని తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా గూడూరు జిల్లా పరిషత్ పాఠశాలలో డీఈవో విద్యర్థులతో సమావేశమై మాట్లాడారు. మండలంలో డ్రాపౌట్‌గా ఉన్న 48 మంది విద్యార్థులు తిరిగి ఆయా పాఠశాలల్లో చేరారని తెలిపారు.