Share News

హోరాహోరీగా బండలాగుడు పోటీలు

ABN , Publish Date - Apr 06 , 2025 | 12:37 AM

మండలంలోని ఉప్పలదడియ గ్రామంలో ఉగాది, రంజాన్‌, శ్రీరామనవమి, గుడ్‌ప్రైడే సందర్భంగా రాష్ట్ర స్థాయి ఆరు పండ్ల ఎడ్ల బండలాగుడు పోటీలను ఎమ్మెల్యే గిత్తా జయసూర్య శనివారం ప్రారంభించారు.

హోరాహోరీగా బండలాగుడు పోటీలు
విజేతకు బహుమతి అందజేస్తున్న మాండ్ర శివానంద రెడ్డి

మిడుతూరు, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఉప్పలదడియ గ్రామంలో ఉగాది, రంజాన్‌, శ్రీరామనవమి, గుడ్‌ప్రైడే సందర్భంగా రాష్ట్ర స్థాయి ఆరు పండ్ల ఎడ్ల బండలాగుడు పోటీలను ఎమ్మెల్యే గిత్తా జయసూర్య శనివారం ప్రారంభించారు. ఈ హోరాహోరీగా సాగాయి. కర్నూలు జిల్లా బి.తాండ్రపాడు గ్రామానికి చెందిన వరలక్ష్మి ఎద్దులు మొదటి స్థానంలో, గద్వాల జిల్లా కంచుపాడు గ్రామానికి చెందిన అంజి రెడ్డి ఎద్దులు రెండో స్థానంలో నిలిచాయి. ఇందువాసి గ్రామం, రాయపురం గ్రామాలకు చెందిన రక్షిత్‌ పటేల్‌, వల్లా రెడ్డీ ఎద్దులు మూడో స్థానంలో, ప్రొద్దుటూరుకు చెందిన డీసీఎస్‌ఆర్‌ బుల్స్‌ నాలుగో స్థానంలో, పసుపుల, రాయచర్ల గ్రామాలకు చెందిన శేఖర్‌, జయచంద్ర ఎద్దులు ఐదో స్థానంలో, దైవందిన్నె, ఉత్తనూరు గ్రామాలకు చెందిన లక్ష్మీనరసింహ, నరేష్‌ ఎద్దులు ఆరో స్థానంలో, కొణిదేల, మిడుతూరు గ్రామాలకు చెందిన శేఖర్‌, సాయి వర్ధన్‌ ఎద్దులు ఏడో స్థానంలో, మండ్లెం గ్రామానికి చెందిన మహబూబ్‌ బాషా ఎద్దులు ఎనిమిదో స్థానంలో నిలిచాయి. ఈ పోటీల్లో గెలుపొందిన ఎద్దుల యజమానులకు వరుసగా ఎనిమిది నగదు బహుమతులు రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ. 10 వేలు, రూ.8 వేలు, రూ.5 వేలు అందజేశారు. ఈ బహుమతులను టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి అందజేశారు. టీడీపీ సీనియర్‌ నాయకుడు మాండ్ర సురేంద్రనాథ్‌ రెడ్డి, నందికొట్కూరు మార్కెట్‌ యార్డు చైర్మన్‌ ప్రసాద రెడ్డి, వైస్‌ చైర్మన్‌ సుధాకర్‌, పార్టీ మండల కన్వీనర్‌ రమేష్‌ రెడ్డి, నాయకులు రాజశేఖర రెడ్డి, జయరామి రెడ్డి, రామస్వామి రెడ్డి, మనోహర్‌ రెడ్డి, సర్వోత్తమ రెడ్డి, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2025 | 12:37 AM