Share News

చేనేతలు అభివృద్ధి చెందాలి: ఎమ్మెల్యే బీవీ

ABN , Publish Date - Apr 04 , 2025 | 12:36 AM

రాబోయే రోజుల్లో చేనేతలు ఆధునిక నైపుణ్యాలను అందిపుచ్చుకొని వాటిని ఉపయోగించుకుని అభివృద్ధిలోకి రావాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు.

చేనేతలు అభివృద్ధి చెందాలి: ఎమ్మెల్యే బీవీ
మాట్లాడుతున్న ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి

ఎమ్మిగనూరు, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): రాబోయే రోజుల్లో చేనేతలు ఆధునిక నైపుణ్యాలను అందిపుచ్చుకొని వాటిని ఉపయోగించుకుని అభివృద్ధిలోకి రావాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని టీబీపీ కాలనీలో ఎమ్మెల్యే స్వగృహం దగ్గర చేనేత వసా్త్రల కొత్త డిజైన్లపై చేనేత మహిళలకు అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి చేనేత జౌళిశాఖకు చెందిన ప్రముఖ డిజైనర్‌ రామ్‌ చంద్రిక హాజరయ్యారు. ఆమె ప్రస్తుతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త కొత్త డిజైన్లపై చేనేతలు అవగాహన పెంచుకోవాలన్నారు. నూతన డిజైన్లపై ప్రభుత్వం ఇచ్చే శిక్షణలను వినియోగించుకొని వాటి ఆధారంగా ఎమ్మిగనూరులోనే నూతన డిజైన్ల వసా్త్రలను తయారు చేసి మార్కెటింగ్‌ చేసుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ చేనేత కార్మికుల నైపుణ్యం పెంచుకునేందుకు అవకాశాలను కల్పిస్తామన్నారు. చేనేతలు చేనేత కార్మికులుగా మాత్రమే కాకుండా ప్రతిభ కనబరచి చేనేతకళాకారులుగా గుర్తింపు పొందాలన్నారు. అలాగే ఎమ్మెల్యే సతీమణి నిత్యాదేవి మాట్లాడుతూ చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలను పెంచేందుకు కృష్టి చేస్తామన్నారు. ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామన్నారు. అనంతరం ఎమ్మెల్యే బీవీ, డిజైనర్‌ రామ్‌ చంద్రికలు స్థానిక చేనేతజౌళి శాఖ అధికారులతో కలిసి పట్టణంలోని చేనేత వార్డుల్లో గుంత మగ్గాలను, రేషన మగ్గాలను పరిశీలించారు. అలాగే వైడబ్ల్యూసీఎ్‌సను సందర్శించారు. సొసైటీ సభ్యులు తము ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే ముందు ఏకరువు పెట్టారు. ప్రధానంగా ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు, యారన సబ్సీడీ, సభ్యుల పిల్లలకు ఏక్లాస్‌ మెంబర్‌ షిఫ్‌ ఇచ్చి కొత్తగా రేషన మగ్గాలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని ఎమ్మెల్యేను కోరారు. ఇందుకు ఎమ్మెల్యే స్పందిస్తు సభ్యుల సమస్యలను త్వరలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో నాగరాజరావు, నాయకులు మిన్నప్ప, నరసప్ప, బుగుడే నాగరాజు, రాజు, మహేష్‌, మల్లయ్య, చేనేత కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2025 | 12:36 AM