Police Case: గోరంట్లపై తాడేపల్లి పీఎస్‌లో కేసు
ABN , Publish Date - Apr 11 , 2025 | 10:58 AM
గోరంట్ల మాధవ్‌పై తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదు అయింది. ఐటీ విద్య శాఖల మంత్రి నారా లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో టీడీపీ నేతలు తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై గోరంట్లకు నోటీసులు ఇచ్చే అవకాశముంది.

గుంటూరు జిల్లా: వైసీపీ నేత (YCP Leader), హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ (Ex MP Gorantla Madhav)పై తాడేపల్లి పోలీస్ స్టేషన్ (Tadepalli Police Station)లో మరో కేసు (Case) నమోదు అయింది. నిన్న (గురువారం) తాడేపల్లిలో మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh)పై మాధవ్ అనుచిత వ్యాఖ్యలు (Comments) చేశాడు. దీంతో టీడీపీ నేతలు (TDP Leaders) గోరంట్ల మాదవ్‌పై తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాప్తాడు పర్యటనలో పోలీసులు తగిన భద్రత కల్పించకపోవడంపై మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదే క్రమంలో మంత్రి లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆతనిపై కేసు నమోదైంది.
Also Read..: ఒంటిమిట్ట కోదండరామునికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు
కాగా గోరంట్ల మాధవ్ గుంటూరులో పోలీసులపై రెచ్చిపోయాడు. వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పోలీసుల అదుపులో ఉన్న చేబ్రోలు కిరణ్‌పై దాడి చేయడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. ఇబ్రహీంపట్నం శివారులో కిరణ్‌ను అరెస్టుచేసి తీసుకొస్తున్న పోలీసులను గుంటూరు ఎస్పీ కార్యాలయం సమీపంలో అడ్డగించబోయాడు. ఈ సందర్భంగా గుంటూరు ఎస్పీ కార్యాలయం వద్ద మాధవ్ హల్‌చల్ చేశాడు. దీంతో మాధవ్ సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి కిరణ్ సోషల్ మీడియాలో భారతిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలుగుదేశం అధిష్టానం వెంటనే స్పందించి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కిరణ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కూడా ఆదేశించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కిరణ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసి తీసుకువెళుతుండగా.. పోలీసుల విధులకు మాధవ్ అడ్డుతగలడమే కాకుండా, వారిపైనా దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అంతకుముందు, తన అనుచరులతో కారులో పోలీసుల వాహనాన్ని వెంబడించాడు. పోలీసుల అదుపులో ఉన్న కిరణ్‌పై దాడికి యత్నించాడు. అడ్డుకున్న పోలీసులపైనా విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో పోలీసుల వాహనం ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లింది. అయినా, వదలకుండా ఆ వాహనాన్ని మాధవ్ వెంబడించాడు.
ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలోనూ కిరణ్‌పై గోరంట్ల మరోసారి దాడికి ప్రయత్నించాడు. దీంతో గోరంట్లతో పాటు ఆయన అనుచరులు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ కార్యాలయంలోని ఒక గదిలో కొంతసేపు వారిని నిర్బంధించారు. అనంతరం అక్కడ నుంచి నగరంపాలెం పోలీస్ స్టేషన్‌కు, ఆ తర్వాత నల్లపాడు స్టేషన్‌కు తరలించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగీంచడం తోపాటు పోలీసుల అదువులో ఉన్న నిందితుడిపై దాడికి యత్నించడం తదితర సెక్షన్ల కింద నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం కోర్టులో హాజరు పరుస్తామని పోలీసు అధికారులు తెలిపారు. కాగా, కిరణ్‌ను ఇబ్రహీంపట్నం నుంచి గుంటూరు ఎస్పీ కార్యాలయానికి తరలిస్తున్నారనే విషయం, ఏ వాహనంలో తీసుకొస్తున్నారనేది మాధవ్‌కు ఎలా తెలిసిందనేది ప్రస్తుతం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. వైసీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్న పోలీస్ అధికారే లీక్ చేసి ఉంటారనే ప్రచారం జరుగుతోంది. గురువారం విజయవాడలో మీడియా సమావేశంలో పాల్గొన్న గోరంట్ల మాధవ్ ఆ తరువాత నేరుగా కిరణ్‌ను తరలిస్తున్న పోలీసు వాహనాన్ని గుర్తించి వెంబడించడం అనుమానాలకు తావిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
తహవ్వుర్ రాణాకు 18 రోజుల ఎన్ఐఏ కస్టడీ
చాలా రోజులు ఖాళీగా ఇల్లు.. డోర్ ఓపెన్ చేయగా షాక్..
For More AP News and Telugu News