Share News

జై హనుమాన్‌...

ABN , Publish Date - Apr 13 , 2025 | 12:01 AM

విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ), బజరంగ్‌ దళ్‌ సంయుక్తంగా శనివారం సాయంత్రం కర్నూలు నగరంలో జరిగిన వీర హనుమాన్‌ శోభాయాత్ర ఉత్సాహంగా సాగింది.

జై హనుమాన్‌...

కర్నూలులో ఉత్సాహంగా సాగిన శోభాయాత్ర

కర్నూలు కల్చరల్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ), బజరంగ్‌ దళ్‌ సంయుక్తంగా శనివారం సాయంత్రం కర్నూలు నగరంలో జరిగిన వీర హనుమాన్‌ శోభాయాత్ర ఉత్సాహంగా సాగింది. పాతనగరంలోని జమ్మిచెట్టు సమీపంలో గల లలితా పీఠంలో భారీ హనుమాన్‌ విగ్రహాన్ని వాహనంపై నిలిపి పూజలు చేశారు. ఈ పూజల్లో కర్నూలు పార్లమెంటు సభ్యుడు బస్తిపాటి నాగరాజు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, వీహెచ్‌పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమిశెట్టి వెంకట్రామయ్య, విష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర కోశాధికారి మహేష్‌, జిల్లా అధ్యక్షుడు టీజీ మద్దిలేటి, బజరంగ్‌ దళ్‌ రాష్ట్ర కన్వీనర్‌ పోలేపల్లి సందీప్‌, వీహెచ్‌పీ రాష్ట్ర సంపర్క్‌ ప్రతాపరెడ్డి, వీహెచ్‌పీ ప్రతినిధులు గోరంట్ల రమణ, మీనుగ రాజేశ్‌, నీలి నరసింహ, జిల్లా కార్యదర్శి ఈపూరి నాగరాజు పాల్గొన్నారు. అనంతరం ఈ శోభాయాత్ర వన్‌టౌన్‌, పూలబజార్‌, పెద్దమార్కెట్‌, కొండారెడ్డి బురుజు, రాజ్‌విహార్‌ మీదుగా బుధవారపేట వరకు కొనసాగింది.

శోభాయాత్రకు భారీ బందోబస్తు

కర్నూలు క్రైం: హనుమాన్‌ జయంతి పురస్కరించుకుని ఆంజనేయస్వామి ఆలయాలు, శోభాయాత్రలకు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా డీఎస్పీ బాబు ప్రసాద్‌ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారు.

Updated Date - Apr 13 , 2025 | 12:01 AM