టీడీపీలో కార్యకర్తలకే అందలం
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:10 AM
‘టీడీపీలో నిబద్ధతతో పని చేసే కార్యకర్తలు, నాయకులకు అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అండగా ఉంటారు.

సమన్వయంతో ముందుకు సాగాలి
బీటీ నాయుడు ఆత్మీయ సన్మాన సభలో మంత్రి టీజీ భరత్
అధినేత చంద్రబాబుకు రుణపడి ఉంటా : ఎమ్మెల్సీ బీటీ
కర్నూలు, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): ‘టీడీపీలో నిబద్ధతతో పని చేసే కార్యకర్తలు, నాయకులకు అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అండగా ఉంటారు. అందలం ఎక్కిస్తారని, అందుకు ఎమ్మెల్యేల కోటాలో రెండోసారి ఎమ్మెల్సీగా ఎంపికై మండలిలో అడుగుపెట్టిన బీటీ నాయుడే నిదర్శనం..’ అని రాష్ట్ర వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. ఇటీవల ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన బీటీ నాయుడుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం నిర్వహించారు. స్థానిక జడ్పీ సమావేశం హాల్‌లో జరిగిన ఆ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు, బీటీ అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు కష్టపడుతున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గాల స్థాయిలో కూటమి నాయకులు, కార్యకర్తలు కలసి సమన్వయంతో ముందుకు వెళ్లాలని, చిన్నచిన్న సమస్యలు ఉంటే చర్చించుకొని పరిష్కరించుకోవాలని సూచించారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ టీడీపీలోనే బీసీలకు రాజకీయ చైతన్యం, పదవులు సాధ్యమన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి మాట్లాడుతూ అధినేత చంద్రబాబు ఏ పని అప్పగించినా క్రమశిక్షణతో చేసేవారన్నారు. పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు మాట్లాడుతూ రాజ్యాంగ పదవుల్లో బీసీలకు పెద్దపీఠ వేసిన పార్టీ టీడీపీనే అన్నారు. ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ ఆదోని కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని, అవి నీటిమీద బుడగలే అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో బలహీనవర్గాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.
టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కె.మీనాక్షినాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర, ఏపీ కురువ/కురబ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మ, ఆలూరు, మంత్రాలయం ఇన్‌చార్జిలు వీరభద్రగౌడ్, ఎన్.రాఘవేంద్రరెడ్డి, నాగేశ్వరరావు యాదవ్ తదితరులు మాట్లాడుతూ అధినేత చంద్రబాబు మనసు గెలుచుకున్న వ్యక్తి బీటీ నాయుడు అని కొనియాడారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా టీడీపీ సీనియర్ నాయకుడు మాండ్ర శివానందరెడ్డి, నందికొట్కూరు ఇన్‌చార్జి గౌరు వెంకటరెడ్డి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకేపోగు ప్రభాకర్, సీనియర్ నాయకులు వైకుంఠం జ్యోతి ప్రసాద్, కేవీ సుబ్బారెడ్డి, గట్టు తిమ్మప్ప, నంద్యాల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబుకు రుణపడి ఉంటా : బీటీ నాయుడు
అధినేత, సీఎం చంద్రబాబు, యువనేత నారా లోకేశ్ ఎంతో నమ్మకంతో రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. వారికి జన్మాంతరం రుణపడి ఉంటా. బీసీలకు టీడీపీ ద్వారానే రాజకీయ చైతన్యం, రాజ్యాంగబద్దమైన పదవులు సాధ్యం అవుతాయి. క్రమశిక్షణ, నిబద్ధతతో టీడీపీలో పని చేస్తే పదవులు, బీ-ఫారంలు ఇంటికే వస్తాయి. పేర్కొన్నారు. వైసీపీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే జగన్, ఆ పార్టీ నాయకులు దుష్ప్రచారాలను టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడ తిప్పికొట్టాలి.