భక్తి శ్రద్ధలతో మట్టల ఆదివా రం
ABN , Publish Date - Apr 13 , 2025 | 11:47 PM
పట్టణం లో క్రైస్తవులు మట్టల ఆదివారాన్ని భక్తి శ్రద్దలతో జరుపుకు న్నారు. విక్టోరియా పేట సీఎస్‌ఐ చర్చ్, ఎస్‌కేడీ కాలనీ హొలీ ట్రినిటీ చర్చ్, రాయనగర్ ఎంబీబీ చర్చి, రాయనగర్ క్రైస్ట్ రిఫామ్ (సీఆర్) చర్చి, మండగిరి ఆర్‌సీఎం చర్చిలో ఉద యం ఖర్జూరపు (ఈత) మట్టలు చేత పట్టుకొని క్రైస్తవులు హోసన్నా, ప్రభువైన యేసుకు జయం అంటూ ర్యాలీ నిర్వహించారు.

ఆదోని అగ్రికల్చర్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): పట్టణం లో క్రైస్తవులు మట్టల ఆదివారాన్ని భక్తి శ్రద్దలతో జరుపుకు న్నారు. విక్టోరియా పేట సీఎస్‌ఐ చర్చ్, ఎస్‌కేడీ కాలనీ హొలీ ట్రినిటీ చర్చ్, రాయనగర్ ఎంబీబీ చర్చి, రాయనగర్ క్రైస్ట్ రిఫామ్ (సీఆర్) చర్చి, మండగిరి ఆర్‌సీఎం చర్చిలో ఉద యం ఖర్జూరపు (ఈత) మట్టలు చేత పట్టుకొని క్రైస్తవులు హోసన్నా, ప్రభువైన యేసుకు జయం అంటూ ర్యాలీ నిర్వహించారు. సీఎస్‌ఐ చర్చి పాస్టర్ రెవరెండ్ విలియం సుజిత్ మాట్లాడుతూ ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరణించక మునుపు గుడ్‌ప్రై డే ముందు ఆదివారం యెరుషలేములోకి ప్రవేశించినప్పుడు హొసన్నా జయం, జయం అని, ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక అని ప్రజలు స్వాగతం పలికారన్నారు. యేసుక్రీస్తు సిలువలో మానవుల పాపపరిహారార్థం మరణించి మూడోరోజు తిరిగి లేచారని తెలిపారు. మండగిరి క్యాథలిక్ చర్చి పాస్టర్ రెవరెండ్ కోలా విజయరాజు, సీఆర్ చర్చి పాస్టర్ బ్రదర్ తిమోతి, పాస్టర్ ఎమ్మోస్ రావు, సంఘపెద్దలు సునీల్ రాజ్‌కుమార్, శ్రీకాంత్, డేవిడ్, విల్సన్ పాల్గొన్నారు.
దేవనకొండ: తెర్నేకల్ గ్రామం ఏబీఎం చర్చిలో రెవ.సాదోక్ మోరిస్ అధ్వర్యంలో మట్టాల ఆదివా రం నిర్వహించారు. టీచర్లు సతీష్‌కుమార్, షాలేం రాజు, హోసన్న, అజయ్, గ్రామ సర్పంచ్ అరుణ్‌కుమార్, పులినరేష్ పాల్గొన్నారు.
ఆలూరు: కొట్టాల గ్రామంలో గుడ్‌ఫ్రైడేకు ముందు వచ్చే మట్టాల ఆదివారాన్ని క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. సీఎస్‌ఐ చర్చి పాస్టర్ రెవ. పుస్తెల కుమార్, సంఘ పెద్దలు దేవపుత్ర, ఆర్కేవిక్రం బాబు, ఆశీర్వాదం, ఆనందు దానప్ప, ధర్మన్న, రాజు, యవనస్తులు ఎస్ బెన్నీ పి.ప్రసాద్, సురేష్ బాబు, ఇమ్మానియేల్, భాస్కర్, సంఘ కాపరులు సత్యానందం, భాస్కర్, స్ర్తీలు పాల్గొన్నారు