Srisailam: శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలు రద్దు
ABN , Publish Date - Feb 12 , 2025 | 08:28 AM
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం ఆలయం ముస్తాబవుతోంది. శక్తి పీఠం, జ్యోతిర్లింగం కొలువైన ప్రదేశం కావడంతో మహాశివరాత్రికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మహాశివరాత్రి పర్వదినాన శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించుకుని భక్తులు తరిస్తుంటారు.

కర్నూలు జిల్లా: శ్రీశైలం (Sri Sailam) మహాశివరాత్రి (Maha Shivaratri) బ్రహ్మోత్సవాలు (Brahmotsavalu) ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్జిత సేవలు రద్దు (Cancellation of Acquired Services) చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే శివ దీక్షాపరులకు 19వ తేదీ నుంచి 23 వరకు స్పర్శ దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు. కాగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం ఆలయం ముస్తాబవుతోంది. శక్తి పీఠం, జ్యోతిర్లింగం కొలువైన ప్రదేశం కావడంతో మహాశివరాత్రికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు దేవస్థాన యంత్రాంగం కృషి చేస్తోంది. పాతాళగంగ వద్ద రక్షణ కంచెలు, మహిళలు బట్టలు మార్చుకునే గదులకు మరమ్మతులు చేస్తున్నారు. మరోవైపు శివ దీక్ష భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ వార్త కూడా చదవండి..
మేడారం మినీజాతర.. మొక్కులు చెల్లించకోనున్న భక్తులు
ప్రభుత్వం గుడ్ న్యూస్
కాగా మహాశివరాత్రి ఏర్పాట్లపై మంత్రుల బృందం శ్రీశైలం వచ్చి సమీక్ష నిర్వహించింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించింది. అలాగే శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం వచ్చే భక్తులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నాలుగు రోజులపాటు భక్తులకు ఉచితంగానే లడ్డూ ప్రసాదం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రుల బృందం ప్రకటన చేసింది. అలాగే క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు మంచినీళ్లు బాటిల్, పాలు, బిస్కెట్లు ఉచితంగా అందజేయనున్నారు. శ్రీశైలం క్షేత్ర పరిధిలో పార్కింగ్ ప్రదేశాల నుంచి భక్తులను వసతి గృహాలకు, సత్రాలకు తరలించేందుకు ఉచిత మినీ వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. మహాశివరాత్రి రోజున దేవస్థానం టోల్ గేట్ రుసుము లేకుండా ఉచితంగా వాహనాలను అనుమతించాలని మంత్రుల బృందం నిర్ణయించింది.
23న చంద్రబాబు శ్రీశైలం పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 23న శ్రీశైలం క్షేత్రానికి రానున్నారు. మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీఎం పట్టువస్త్రాలు అందజేస్తారు. ఇదిలా ఉండగా ఎన్నడూ లేని విధంగా సీఎం నేరుగా హాజరై స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వస్తుండటం విశేషం. గతంలో ప్రభుత్వం తరుపున ఎవరైనా మంత్రులు వచ్చి పట్టువస్త్రాలు స్వామి వారికి సమర్పించేవారు. శ్రీశైలానికి సీఎం చంద్రబాబు వస్తున్నారన్న సమాచారంతో జిల్లా యంత్రాంగంతో పాటు ఆలయ అధికారులు కూడా తగిన ఏర్పాట్లుకు సిద్ధమయ్యారు.
కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది కంటే ఈసారి 30 శాతం అధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. సామాన్య భక్తునికి స్వామి అమ్మవార్ల దర్శనం పొందేలా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని మంత్రులు ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ లిక్కర్ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలి
ఏడాదైనా ఫైళ్లు క్లియర్ చేయరా?
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News