‘కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి’
ABN , Publish Date - Apr 04 , 2025 | 01:18 AM
పంట దిగుబడుల కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మార్క్‌ఫెడ్ డీఎం హరినాథ్‌రెడ్డి, ఆత్మకూరు ఏడీఏ ఆంజనేయ పేర్కొన్నారు.

ఆత్మకూరు, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): పంట దిగుబడుల కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మార్క్‌ఫెడ్ డీఎం హరినాథ్‌రెడ్డి, ఆత్మకూరు ఏడీఏ ఆంజనేయ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం స్థానిక రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన కంది, మినుము, శనగ దిగుబడుల కొనుగోలు కేంద్రాన్ని శ్రీశైలం ట్రస్టు బోర్డు మాజీ చైర్మన్ వంగాల శివరామిరెడ్డి, టీడీపీ మండలాధ్యక్షులు శివప్రసాద్‌రెడ్డి, వీఆర్‌ఎస్పీ ప్రాజెక్ట్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జునరెడ్డి, టీడీపీ పట్టణ కార్యదర్శి అబ్దుల్లాపురం బాషా, క్లస్టర్ ఇన్‌ఛార్జ్ రాజారెడ్డిలతో కలిసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ కింటం కందులు రూ.7550, మినుములు రూ.7400, శనగలు రూ.5650 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన రైతులు తమ గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ర్టేషన్ చేసుకొని విక్రయించుకోవాలని సూచించారు. రైతులకు చెల్లించాల్సిన డబ్బు ఆలస్యం చేయకుండా వారం రోజుల్లో చెల్లించనున్నట్లు వెల్లడించారు. అనంతరం సబ్సిడీ కింద మంజూరైన యంత్రపరికరాలు, పవర్ స్ర్పేయర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మండల అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి, డీసీఎంఎస్ బ్రాంచ్ మేనేజర్ నవీన్‌కుమార్, రైతు సంఘాల నాయకులు టపాల్ అష్రఫ్‌అలి తదితరులు ఉన్నారు.