Share News

ప్రపంచ ఆరోగ్య సంస్థ దినోత్సవం

ABN , Publish Date - Apr 08 , 2025 | 12:43 AM

ఆరోగ్యపరమైన సమస్యల పరిష్కారానికే డబ్ల్యూహెచ్‌వో ఏర్పాటు చేశారని ఐఎంఏ సభ్యుడు డా. గోపీనాథ్‌, ఆదోని బ్రాంచ్‌ అధ్యక్షుడు డాక్టర్‌ కృష్ణమూ ర్తి అన్నారు.

 ప్రపంచ ఆరోగ్య సంస్థ దినోత్సవం
ఆదోనిలో వైద్య సిబ్బంది ర్యాలీ

ఆదోని టౌన్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యపరమైన సమస్యల పరిష్కారానికే డబ్ల్యూహెచ్‌వో ఏర్పాటు చేశారని ఐఎంఏ సభ్యుడు డా. గోపీనాథ్‌, ఆదోని బ్రాంచ్‌ అధ్యక్షుడు డాక్టర్‌ కృష్ణమూ ర్తి అన్నారు. సోమ వారం పట్ణణంలో వైద్యులు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకున్నారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉంటేనే సమాజం సుభిక్షంగా ఉంటుందన్నారు. వైద్యులు మధుసూదన్‌, రామామణి, కృష్ణదేవరాయలు, గోపీనాథ్‌, గంగాధర్‌ రావు, హరీష్‌, అనూష, మురళి మోహన్‌ పాల్గొన్నారు.

వైద్య సిబ్బంది ర్యాలీ

డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ సత్యవతి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఆహార నియమాలు పాటించని కారణంగా రోగాల భారిన పడుతున్నారన్నారు. యూపీహెచ్‌సీ డాక్టర్లు అనిల్‌, వినోద్‌, మహేష్‌, టీబీ సిబ్బంది, ఎంపీహెచ్‌ఎస్‌ బాబు రాజు, ఇతర విభాగాల సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

మద్దికెర: ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రభుత్వ వైద్యాధికారి శ్రీలక్ష్మి అన్నారు. సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరిం చుకుని మద్దికెరలో ర్యాలీ నిర్వహించారు. తల్లి, నవజాత శిశువుల ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉండేందుకు ఆరోగ్య సూత్రాలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌వో నిరంజన్‌బాబు, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ అక్బర్‌బాషా, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 08 , 2025 | 12:43 AM