Vikasit Bharat: తెలుగమ్మాయికి అత్యుత్తమ అవార్డు
ABN , Publish Date - Apr 04 , 2025 | 01:40 PM
Youth Parliament: వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్‌లో తెలుగు యువతి ప్రతిభ కనబరిచింది. బెస్ట్ యూత్ పార్లమెంటేరియన్ అవార్డును లాస్యప్రియ గెలుచుకున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశంపై ఉత్తమ సమాధానాలు ఇవ్వడంతో లాస్యప్రియ ఈ అవార్డు సాధించారు.

ఢిల్లీ: వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్‌లో తెలుగు యువత ప్రతిభ చాటారు. బెస్ట్ యూత్ పార్లమెంటేరియన్ అవార్డును వి. లాస్యప్రియ సాధించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఉత్తమ సమాధానం ఇచ్చినందుకు ఈ అవార్డు గెలుచుకున్నారు. "వన్ నేషన్ - వన్ ఎలక్షన్" అంశంపై అడిగిన ప్రశ్నకు లాస్యప్రియ సమాధానం ఇచ్చారు.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఎంఏ (పొలిటికల్ సైన్స్)ను లాస్యప్రియ చదువుకుంటున్నారు. యూత్ పార్లమెంట్‌కు ప్రతి రాష్ట్రం నుంచి ముగ్గురిని కేంద్ర యువజన వ్యవహారాల శాఖ ఎంపిక చేసింది. ఏపీ నుంచి లాస్యప్రియతో పాటు జ్యోత్స అర్థాకుల, ఎం. శివాని లహారి ఎంపికయ్యారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి 3వ తేదీ వరకు యూత్ పార్లమెంట్ ఈవెంట్ ఢిల్లీలో జరిగింది. కేంద్ర మంత్రులు మన్‌సుఖ్ మాండవియా, రక్షా ఖడ్సే చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
AP High Court TTD Case: శ్రీనివాస దీక్షితులుకు ఏపీ హైకోర్ట్ షాక్
Ancient temples: భారతదేశంలో అతి పురాతనమైన ఐదు ఆలయాల గురించి తెలుసా.
Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే
Read Latest AP News And Telugu News