AP Weather Report: 48 గంటల్లో అల్పపీడనం
ABN , Publish Date - Apr 07 , 2025 | 03:59 AM
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమలో ఎండలు పెరగనున్నాయి

పలుచోట్ల పిడుగులు, వడగండ్లతో వర్షాలు
మళ్లీ పెరగనున్న ఎండలు
విశాఖపట్నం, అమరావతి, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తర్వాత మరింత బలపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని అంచనా వేసింది. అయితే అల్పపీడనం ఏర్పడిన తర్వాత కోస్తా, రాయలసీమలో ఎండలు పెరుగుతాయని హెచ్చరించింది. కాగా, ఆదివారం కర్నూలు జిల్లా కామవరంలో 40.8, ప్రకాశం జిల్లా డోర్నాలలో 40.7, నంద్యాల జిల్లా దొర్నిపాడులో 40.6, పల్నాడు జిల్లా రావిపాడులో 40.5, పలు ఇతర చోట్ల 40 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ద్రోణుల ప్రభావం, ఎండ తీవ్రతతో వాతావరణ అనిశ్చితి నెలకొని కొన్నిచోట్ల ఈదురుగాలులు, పిడుగులు, వడగండ్లతో వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Krishna River Tragedy: పండగ వేళ ఘోర విషాదం.. కృష్ణానదిలో పడి.. బాబోయ్..
Mahesh Kumar Goud: మోదీ, అమిత్ షా అనుమతి లేకుండా బండి సంజయ్ టిఫిన్ కూడా చెయ్యరు: మహేశ్ కుమార్ గౌడ్