Minister Kolusu Parthasarathy : పేదల ఇళ్లకు 1న ప్రారంభోత్సవం : పార్థసారథి
ABN , Publish Date - Jan 26 , 2025 | 03:45 AM
సీఎం చంద్రబాబు లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను అందజేస్తారని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.

1.14 లక్షల లబ్ధిదారుల చేతికి తాళాలు
తణుకు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం
వచ్చే డిసెంబరుకు 7 లక్షల పీఎంఏవై ఇళ్లు.. మంత్రి పార్థసారథి వెల్లడి
అమరావతి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన పేదల ఇళ్లను ఫిబ్రవరి 1న ప్రారంభించి, వాటిని 1.14 లక్షల లబ్ధిదారులకు అందజేయనున్నట్లు గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఆరోజు తణుకు నియోజకవర్గంలోని తేతలిలో సీఎం చంద్రబాబు లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను అందజేస్తారని తెలిపారు. అదేరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు,అధికారులు ఇళ్ల లబ్ధిదారులకు తాళాలను అందజేస్తారన్నారు. శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. పీఎంఏవై 1.0 గడువు గత ఏడాది డిసెంబరుతోనే ముగిసినప్పటికీ.. సీఎం చంద్రబాబు కృషితో మరో ఏడాది అంటే 2025 డిసెంబరు వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించిందని మంత్రి చెప్పారు. ఈ పథకంలో భాగంగా 7 లక్షల ఇళ్లను ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు.
ఇళ్ల స్థలాలకు కమిటీలు
పేదలకు ఇళ్ల స్థలాల కోసం విధివిధానాలు రూపొందించేందుకు రాష్ట్రస్థాయిలో రెవెన్యూ మంత్రి ఆధ్వర్యంలో ఒక కమిటీ, జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఎన్టీఆర్ హౌసింగ్ స్కీం లబ్ధిదారులకు బిల్లులు చెల్లించేందుకు రూ. 900 కోట్లు విడుదలకు ప్రయత్నిస్తున్నామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
YS Sharmila: విజయసాయి ఇప్పటికైనా నిజాలు బయటపెట్టు.. షర్మిల చురకలు
విజయసాయి రాజకీయ సన్యాసంపై చంద్రబాబు ఏమన్నారంటే
వివేకానందరెడ్డికి గుండెపోటని ఎందుకు చెప్పానంటే
కూటమి కోసం రాజీనామా.. అసలు విషయం బయటపెట్టిన..
For More Andhra Pradesh News and Telugu News..