Share News

Shivaratri Celebrations : శ్రీశైలానికి కాలినడకన ఎంపీ శబరి

ABN , Publish Date - Feb 24 , 2025 | 05:01 AM

శ్రీశైలంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

Shivaratri Celebrations : శ్రీశైలానికి కాలినడకన ఎంపీ శబరి

పెద్దదోర్నాల, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): శ్రీశైలంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలో కొందరు భక్తులు నల్లమల అటవీ మార్గంగుండా కాలినడకన శ్రీశైలానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి కూడా భక్తులతో కలిసి నల్లమలలో కాలినడకన శ్రీశైలం దేవస్థానానికి బయల్దేరారు. ఆమె వెంట భద్రతా సిబ్బంది, అనుచరులు ఉన్నారు.

Updated Date - Feb 24 , 2025 | 05:01 AM