Minister Narayana: నెల్లూరు నగరాన్ని క్లీన్ సిటీగా మారుస్తాం
ABN, Publish Date - Jan 11 , 2025 | 07:45 AM
Minister Narayana: నెల్లూరు నగరాన్ని క్లీన్ సిటీగా మారుస్తామని మంత్రి నారాయణ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరిస్తున్నామమని చెప్పారు. నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ ఇవాళ(శనివారం) ఆకస్మిక పర్యటన చేశారు.
నెల్లూరు: నెల్లూరు నగరాన్ని క్లీన్ సిటీగా మారుస్తామని మంత్రి నారాయణ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరిస్తున్నామమని చెప్పారు. నెల్లూరు నగర అభివృద్ధిపై మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు.నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ ఇవాళ(శనివారం) ఆకస్మిక పర్యటన చేశారు. ఉదయం 5.30 గంటల నుంచి క్షేత్ర స్థాయి పర్యటన ద్వారా వాస్తవ పరిస్థితులు పరిశీలించారు. 52వ డివిజన్ రంగనాయకుల పేటలో పర్యటించి ప్రజా సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడారు. గోపురం వీధిలో పారిశుధ్య సమస్య ఉందని స్థానికులు తెలపడంతో అక్కడికి వెళ్లి తనిఖీ చేశారు. నెల్లూరు కార్పొరేషన్‌లో శానిటేషన్‌పై మంత్రి నారాయణ స్థానికుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు నగరాన్ని క్లీన్ సిటీగా మార్చేలా ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
జగన్ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసేసింది..
అన్నక్యాంటీన్లలో ఫుడ్ బాగుందని.. పని తీరు కాస్త మెరుగుపరుచుకోవాలని మంత్రి నారాయణ అన్నారు. అన్న క్యాంటీన్లను శనివారం తనిఖీ చేసి మంత్రి నారాయణ బ్రేక్ ఫాస్ట్ చేశారు. అన్న క్యాంటిన్ మొదలుపెట్టిన రోజు ఉన్న క్వాలిటి, క్వాంటిటీని ఈరోజుకు మెయింటైయిన్ చేస్తున్నారని అన్నారు. టైమింగ్స్ విషయంలో ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. ఏజెన్సీ నిర్వాహకులు, డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు సూచనలిచ్చానని అన్నారు. అన్న క్యాంటీన్ల ఏర్పాటును అత్యంత బృహత్తర కార్యక్రమంగా చేపట్టామని తెలిపారు. గత వైసిపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో టీడీపీ మీద కోపంతో అన్న క్యాంటీన్లను మూసేసి లక్షల మంది పొట్టకొట్టిందని చెప్పారు. జగన్ పిచ్చి చేష్టలతోనే 11 సీట్లకు ప్రజలు పరిమితి చేశారని అన్నారు. 175 నియోజకవర్గాల్లో కనీసం ఒక్కటైన అన్న క్యాంటీన్ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Pawan Kalyan: క్షమాపణలు చెప్పాల్సిందే!
Vadde Obanna: రేనాటి వీరుడా వందనం!
Read Latest AP News and Telugu News
Updated Date - Jan 11 , 2025 | 11:26 AM