Pawan Kalyan Eco Tourism: నేడు, రేపు అల్లూరి జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన
ABN, Publish Date - Apr 07 , 2025 | 04:51 AM
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమ, మంగళవారాల్లో అల్లూరి జిల్లా ఏజెన్సీలో పర్యటించనున్నారు. డుంబ్రిగుడ, అరకులోయ ప్రాంతాల్లో శంకుస్థాపనలు చేసి, ఎకో టూరిజంపై సమీక్షించనున్నారు

పాడేరు/అమరావతి, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమ, మంగళవారాలు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి 8గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో అరకులోయ నియోజకవర్గం డుంబ్రిగుడ మండలం చాపరాయికి 11గంటలకు చేరుకుంటారు. దీనికి అవతల వైపున సుమారు 3కిలోమీటర్ల దూరంలో ఉన్న పెదపాడు గ్రామాన్ని సందర్శించి, రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి, అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడినుంచి డుంబ్రిగుడకు చేరుకుంటారు. అల్లూరి జిల్లాకు మంజూరు చేసిన సుమారు 200 రోడ్ల నిర్మాణాలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు. తర్వాత అరకులోయ వెళ్లి ఏపీటీడీసీ హరిత రిసార్ట్స్‌లో రాత్రి బసచేస్తారు. మరుసటి రోజు(మంగళవారం) ఉదయం 10 గంటలకు అరకులోయ మండలం సుంకరమెట్ట సమీపంలోని కాఫీ తోటలకు చేరుకుని, అటవీ శాఖ చెక్కలతో నిర్మించిన కాలిబాట వంతెనను ప్రారంభిస్తారు. అనంతరం రోడ్డు మార్గంలో పవన్ విశాఖపట్నం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కుకు చేరుకొని ఎకో టూరిజంపై అధికారులతో సమీక్షిస్తారు.
Updated Date - Apr 07 , 2025 | 04:52 AM