Share News

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు

ABN , Publish Date - Apr 07 , 2025 | 11:51 PM

మీ కోసం కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌ హాలులో సోమవారం జరిగిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పలు రకాల సమస్యలను కలెక్టర్‌కు విన్నవించారు. ఈసందర్భంగా అధికారులతో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ అన్సారియా మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించాలన్నారు.

 అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు
మీ కోసంలో అర్జీదారుల సమస్యలపై మాట్లాడుతున్న కలెక్టర్‌ అన్సారియా

ఒంగోలు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): మీ కోసం కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌ హాలులో సోమవారం జరిగిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పలు రకాల సమస్యలను కలెక్టర్‌కు విన్నవించారు. ఈసందర్భంగా అధికారులతో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ అన్సారియా మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించాలన్నారు. మీ కోసం కార్యక్రమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అర్జీదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నందున ప్రతి అర్జీపై సంబంధిత అధికారులు అర్థవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కారం చూపాలన్నారు. వచ్చిన అర్జీలను నిర్దేశించిన గడువులోపు పరిష్కరించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్జీలు రీఓపెన్‌ కాకుండా చూడాలన్నారు. అధికారులు ప్రతిరోజు లాగిన్‌ అయ్యి ఆన్‌లైన్‌లో వచ్చిన వినతులను పరిశీలించాలన్నారు. సాంకేతిక సమస్యల వల్ల క్షేత్ర స్థాయిలో పరిష్కరించలేని అర్జీలు వస్తే ఆ విషయాన్ని ప్రజలకు అప్పుడే స్పష్టంగా తెలియజేయాలన్నారు. అటువంటి అర్జీలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని సూచించారు. ఈకార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. గోపాలకృష్ణ, డీఆర్వో చిన ఓబులేషు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు జాన్సన్‌, మాధురి, డిప్యూటీ కలెక్టర్‌ పార్థసారఽథి, వివిధశాఖల అధికారులు ఉన్నారు.

Updated Date - Apr 07 , 2025 | 11:51 PM